ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నది పాత లెక్క. ఒక్క దెబ్బకు వేలాది పిట్టలన్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించే ఫార్ములా. ఆయన తీసుకునే నిర్ణయం ఏదైనా సరే.. భారీగా ప్రభావం చూపించటమే కాదు.. వేలాది మంది తనకు విధేయులయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సంపన్న రాష్ట్రం.. అంతకు మించి వృద్ధిరేటు జోరుగా ఉంటూ భారీ ఎత్తున ఆదాయం వస్తున్న వేళ.. వచ్చిన ఆదాయాన్ని సంక్షేమం పేరుతో కేసీఆర్ మళ్లిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది.
ఎన్నిలకు ముందుగా ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటం.. సంక్షేమానికి పెద్దపీట వేయటం లాంటి విధానాలు కాలం చెల్లినవిగా తేల్చేస్తూ.. ఎన్నికలకు ఏళ్ల ముందునుంచే తిరుగులేని గ్రౌండ్ సిద్ధం చేస్తున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది హోంగార్డుల కుటుంబాలు కేసీఆర్ కు ఫ్యాన్స్ అయ్యే పరిస్థితి. నిత్యం బండ చాకిరీ చేస్తున్నా.. వారి శ్రమకు తగ్గ ఆదాయం లేకుండా ఊసూరుమంటూ బండి లాగే 19వేల మంది హోంగార్డులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు తీపికబురు చెప్పింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు వారి జీతాలు పెంచింది. ప్రస్తుతం హోంగార్డు జీతాలు నెలకు రూ.12 వేలు ఉండగా.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రూ.19,884 చెల్లించనున్నారు. అంటే.. ప్రతి ఒక్క హోంగార్డుకు ప్రస్తుతం తాను అందుకుంటున్న జీతానికి 7,884 రూపాయిల్ని అదనంగా పొందనున్నారు.
జీతాల పెంపుతో పాటు.. ప్రతి హోంగార్డుకు ఇచ్చే యూనిఫాం అలవెన్స్ కూడా పెరగనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న హోంగార్డుల జీతభత్యాల ఇష్యూను కేసీఆర్ పరిష్కరించడం చంద్రబాబు మెడకు చుట్టుకోనుంది. ఒకట్రెండు నెలలు ఆలస్యంగా అయినా.. హోంగార్డుల జీతాలు అక్కడ కూడా పెంచక తప్పనిసరి పరిస్థితి. లేకపోతే దానిని అది పరోక్ష రాజకీయ ప్రభావాన్ని చూపే ప్రమాదముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/