ప్రస్తుతం తెలంగాణ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలను తలపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నుంచి కలెక్టర్ల వరకు ఎవరిని కదిలించినా దళితుల నామస్మరణే వినిపిస్తోంది. దళితులపై చీమ చిటుక్కుమన్నా.. కూడా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోంది. అదేసమయంలో వారికి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వెంటవెంటనే అమలు కూడా చేస్తోంది.
దీనికి ప్రధాన కారణం.. త్వరలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండడమేనని అంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలోని దళితులను తన పక్షానికి తిప్పుకోవడం.. మాజీ మంత్రి, టీఆర్ ఎస్‌కు ఇప్పుడు ప్రధాన శత్రువుగా మారిన ఈటల రాజేందర్ ను ఘోరంగా ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన, ఆయన మంత్రివర్గం.. అధికారులు కూడా దళితుల నామస్మరణ చేస్తున్నారు. ముఖ్యంగా దళిత బంధు.. పథకాన్ని ప్రవేశ పెట్టారు. హుజూరాబాద్‌కు ఏకంగా 2000 కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం కేటాయించారు. దళిత వాడలకు వెళ్లి(వాసాలమర్రి) భోజనాలు చేస్తున్నారు. దళితుల కోసం ఎంతో చేస్తున్నానని చెబుతున్నారు. ఇలా.. అనేక రూపాల్లో దళితులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్.. అదే క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కార్యాలయంలో తొలిసారి ఓ దళిత అధికారిని నియమించనున్నారు.
వాస్తవానికి ఇప్పటికి గతంలో నాలుగేళ్లు.. అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పటికి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన నేపథ్యంలో.. కేసీఆర్.. ఎప్పుడూ.. తన కార్యాలయం సీఎంవోలో దళితులకు చోటుఇవ్వలేదు.కానీ, ఇప్పుడు నలువైపుల నుంచి వస్తున్న విమర్శలకు తోడు కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేశారు. దళిత అధికారి రాహుల్ బొజ్జాను తన ఆఫీస్‌లో నియమించుకోవడంతోపాటు.. ‘దళిత బంధు’ పథకం పర్యవేక్షణ బాధ్యతలను బొజ్జాకు అప్పగించనున్నట్లు ప్రకటించారు.
రాహుల్‌ను సీఎంఓ కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఓ దళిత అధికారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో కొలువు దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాహుల్ ప్రస్తుతం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ప్రముఖ న్యాయవాది, హక్కుల నేత దివంగత బొజ్జా తారకం తనయుడే రాహుల్. 2000 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాహుల్, గతంలో వ్యవసాయ శాఖ కార్యదర్శిగా, కమిషనర్‌గా పని చేశారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో విపక్షాలు, దళిత సంఘాలు, బీజేపీ నేత ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దళిత సామాజిక వర్గానికి చెందిన రాహుల్ బొజ్జాను సీఎంఓలో నియమించడం గమనార్హం.