అంతా కొత్తే. కొత్త.. కొత్త అంశాలతో జీవోల మీద జీవోలు జారీ అయ్యాయి. అనుకున్న విధంగానే.. సోమవారం అర్థరాత్రి 12.21 నిమిషాలకు తెలంగాణలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలకు సంబంధించిన జీవోలు ఒకటి తర్వాత ఒకటిగా విడుదల కావటం మొదలైంది. విజయానికి ప్రతీక అయిన విజయదశమి ఘడియలో వచ్చిన వేళ.. ఇప్పటివరకూ 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే చెప్పినట్లుగా.. ‘‘31’’ జిల్లాలుగా మారిపోయింది. దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అవతరించేందుకు వీలుగా..పాలనా సౌలభ్యంతో పాటు.. చిన్న జిల్లాలతో మరింత ప్రగతి సాధ్యమన్న కొత్త ఆశలతో కొలువు తీరింది.
ముందుగా అనుకున్న ముహుర్తానికి తగ్గట్లే.. కర్కాటక లగ్నంలో 12.21 గంటలకు జీవో నెంబరు 221 పేరిట కొత్త జిల్లాలకు సంబంధించిన జీవో విడుదలైంది. ఒక్కో జిల్లాకు ఒక్కో జీవో చొప్పున మొత్తం 31 జిల్లాలకు సంబంధించిన జీవోలు జారీ చేశారు. జీవోల జారీ పూర్తి అయిన వెంటనే.. సదరు జీవో కాపీల్ని ప్రింటింగ్ చేసేందుకు వీలుగా అప్పటికప్పుడు ప్రింటింగ్ కార్యాలయానికి జీవోల్ని పంపారు.అంతా బాగున్న వేళ.. సాంకేతిక సమస్య ఎదురైంది. జీవో కాపీల్ని వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసేందుకు సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు చెబుతున్నారు.
దీంతో.. జీవోల్ని మాన్యువల్ గా విడుదల చేయాల్సి వచ్చింది. ఇక.. కొత్త జిల్లాలకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మంత్రివర్గం అత్యవసర సమావేశం జరుగుతుందన్న ప్రచారం జరిగినా.. బతుకమ్మ సంబరాలతో బిజీగా ఉన్న కారణంగా మంత్రివర్గ సమావేశం జరగలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా సర్క్యులేషన్ పద్ధతిలో జిల్లాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది.
ఆసక్తికర అంశం ఏమిటంటే.. దేశంలో ఒక రాష్ట్రంలో ఒకేసారి 21 జిల్లాల్ని ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి కావటం.. ఆ రికార్డు తెలంగాణ పేరిట ఉండటం సంతోషించే పరిణామంగా చెప్పొచ్చు. కొత్త జిల్లాలు కొలువు తీరిన వేళ.. మారిన జిల్లాల స్వరూపంతో హైదరాబాద్ జిల్లా మిగిలిన వాటి కంటే భిన్నంగా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 39.43 లక్షల జనాభాతో హైదరాబాద్ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఇక.. 5.43 లక్షల జనాభాతో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇక.. విస్తీర్ణం లెక్కలోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం 8062 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా అవతరిస్తే.. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో హైదరాబాద్ చిన్నజిల్లాగా మారింది. అత్యధిక మండలాలు నల్గొండ జిల్లా (31)లో ఉంటే.. అతితక్కువ మండలు ఉన్న జిల్లాగా వరంగల్ అర్బన్ (11 మండలాలు) నిలిచింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/