తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేసే ప్రతి పని వెనుక లెక్కలు చాలానే ఉంటాయి. పైకి కనిపించే దానికి లోపల విషయానికి సంబంధం లేని రీతిలో ఆయన వ్యవహారశైలి ఉంటుంది. తాజాగా తన తీరుతో గులాబీ బ్యాచ్ లో హాట్ టాపిక్ గా మారారు కేసీఆర్. అధినేత తీరు అర్థం కానట్లు ఉంటుందని చెప్పే గులాబీ నేతలకు తగ్గట్లే ఆయన తాజా తీరు మారింది.
ఎంత అర్థం కాకున్నా.. అసలెందుకు ఇలా చేశారన్న భావన కలిగేలా కేసీఆర్ తీరు తాజా ఢిల్లీ ట్రిప్ సందర్భంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీతో భేటీ కోసం ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకున్న ఆయన.. ఈ సందర్భంగా ముగ్గురు ముఖ్యనేతల్ని కలిశారు. అయితే.. ఒక్కో నేతను కలిసే సందర్భంలో ఒక్కోలా కేసీఆర్ వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోడీతో భేటీకి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలో తన వెంట టీఆర్ ఎస్ లోక్ సభ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్ రెడ్డిని మాత్రమే వెంట తీసుకెళ్లారు. షాతో దాదాపు 40 నిమిషాలు భేటీ అయిన కేసీఆర్.. పలు అంశాల్ని చర్చించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో భేటీకి ఎవరిని వెంట పెట్టుకోకుండా.. ఒక్కరే వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ప్రధానితో భేటీకి తానొక్కరే వెళ్లిన కేసీఆర్.. దీనికిపూర్తి విరుద్ధంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో భేటీకి మాత్రం పార్టీకి చెందిన పలువురు నేతల్ని వెంట తీసుకెళ్లటం గమనార్హం.
ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ 52 నిమిషాల పాటు సాగితే.. హోం మంత్రి అమిత్ షాతో 40 నిమిషాల పాటు సాగింది. ఇక.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేవలం 20 నిమిషాల పాటే సమావేశం సాగింది. ప్రధానితో వినతిపత్రాల్ని అందజేయటంతో పాటు.. రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలను చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. ఇక.. అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ మాత్రం మర్యాదపూర్వకంగా సాగినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఒక్కో ప్రముఖుడితో భేటీ ఒక్కోలా సాగటంపై మాత్రం పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.