ముఖ్యమంత్రులు చాలామందినే చూసి ఉండొచ్చు కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రోటీన్ కు చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన చేసే ప్రతి పని వెనుక కనిపించని లెక్క ఒకటి ఉంటుంది. సాదాసీదాగా చూస్తే.. ఆయన చేసే పనుల వెనుకున్న మర్మాన్ని అర్థం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. చాలా జాగ్రత్తగా ట్రాక్ చేస్తే తప్పించి.. ఆయన అర్థం కారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దగ్గర దగ్గర ఎనిమిదేళ్లు అవుతున్న వేళ.. కేసీఆర్ ఎప్పుడైనా ఒకే రోజున హైదరాబాద్ లో మూడు చోట్ల భూమి పూజ చేయటం చూశారా? ఆ మాటకు వస్తే తోపుల్లాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా..విప్రో ప్రేమ్ జీ లాంటి వాళ్లు పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనరు. ఆ మాటకు వస్తే మర్యాదపూర్వకంగా కలవరు కూడా.
అలాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలందరికి మంత్రి కేటీఆర్ అందుబాటులో ఉండటంతో పాటు.. వారు పాల్గొనే కార్యక్రమాల్లో తాను పాల్గొంటూ తండ్రి గైర్హాజరీని భర్తీ చేస్తుంటారు. దీనికి తగ్గట్లే.. ఆయన నిర్వర్తించే శాఖలు కూడా దాదాపుగా అవే కావటంతో ఎవరూ వేలెత్తి చూపించే వీల్లేదు. ఆ మాటకు వస్తే.. కేటీఆర్ దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేని కార్యక్రమాలను ప్రారంభించేందుకు కూడా కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపరు.
భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల భూమిపూజ.. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యే కేసీఆర్.. అందుకు భిన్నంగా హైదరాబాద్ మహానగరంలో మూడు దిక్కుల్లో ఉన్న మూడు చోట్ల నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల భవన నిర్మాణానికి సంబంధించిన భూమిపూజను ఈ రోజు (మంగళవారం) చేస్తున్నారు. అమీర్ పేటకు కూసింత దూరంలో ఉండే సనత్ నగర్ లో.. దిల్ షుఖ్ నగరంలో భాగమైన చైతన్యపురిలోనూ.. అల్వాల్ కు దగ్గర మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించేందుకు వీలుగా ఈ రోజున భూమి పూజ చేస్తున్నారు.
ఈ మూడు చోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ మూడుచోట్లలో ఒకచోట మాత్రం బహిరంగ సభను ఏర్పాటు చేసి మాట్లాడతారని చెబుతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం వెల్లడికాలేదు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. హైదరాబాద్ వరకు ఏ డెవలప్ మెంట్ కార్యక్రమం అయినా సరే.. దాదాపుగా మంత్రి కేటీఆరే హాజరవుతుంటారు. అలాంటిది తాజా మూడు చోట్ల భూమిపూజకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరు కావటానికి వెనుకున్న అసలు కారణం.. ఆసుపత్రుల శాఖను చూసే మంత్రి హరీశ్ రావుగా చెబుతున్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న నిర్మాణాల భూమిపూజ కు.. అలవాటులో భాగంగా సీఎం రాకుంటే... ఆ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు హరీశ్ రావు హైలెట్ అవుతారు. ఎక్కడైనా బావే కానీ వంగ తోట వద్ద మాత్రం కాదన్నట్లుగా.. తనకెంత విధేయుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ తన కొడుకు కంటే మించి తన మేనల్లుడు హరీశ్ ఫోకస్ కావటం సీఎం కేసీఆర్ కు ఇష్టం ఉండదని చెబుతున్నారు.
ఈ కారణంతోనే సంబంధం లేని మూడు వేర్వేరు ప్రాంతాల్లో భూమి పూజ ఉన్నప్పటికీ.. ఎర్రటి ఎండలో శ్రమ పడి మరీ ప్రోగ్రాంలకు హాజరయ్యేందుకు సీఎం సిద్ధమవుతున్నారంటే కారణం.. హరీశ్ రావేనని చెబుతున్నారు. ఎంతో నిశితంగా చూస్తే తప్పించి.. ఈ లెక్క అర్థం కాదని.. కేసీఆరా మజాకా అంటూ గులాబీ పార్టీకి చెందిన ఒక కీలక నేత విశ్లేషించిన వైనం ఆసక్తికరంగా ఉందని చెప్పక తప్పదు.