తెలంగాణ సీఎం కేసీఆర్ పంతం పట్టారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని రెండోసారి గద్దెనెక్కాకే ప్లాన్ చేశారు. కానీ అప్పుడు ఉద్యోగులంతా ఏకమై సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో హోల్డ్ లో పెట్టారు. ఆ తర్వాత గత జనవరిలో మళ్లీ షురూ చేయగా.. కరోనా దాడి మొదలైంది. కాగా ఇప్పుడు మళ్లీ దుమ్ము దులిపి రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఏ ప్రభుత్వంలోనైనా అత్యంత అవినీతిమయమైన శాఖ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘రెవెన్యూ శాఖనే’. ప్రజలకు నిత్యావసరమైన ఈ శాఖలో పైసలు తడిపితే పనులు జరిగేవి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న కీసర తహసీల్దార్ ఏకంగా ఓ భూ వివాదంలో 1.10 కోట్ల లంచం తీసుకుంటూ చిక్కాడు. ఇక క్షేత్రస్థాయిలో వీఆర్వో, వీఆర్వోఏల అవినీతికి అంతే లేదు.
కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్న కేసీఆర్.. వీఆర్వోలను సమూలంగా తొలగించాలని నిర్ణయించారు. వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు. తహసీల్దార్లకే మ్యూటేషన్ బాధ్యతలను అప్పగించనున్నారు.
మున్సిపల్ చట్టం మాదిరిగానే అవినీతికి ఆస్కారం లేకుండా రూపొందించిన కొత్త రెవిన్యూ చట్టాన్ని కేసీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా లోపాలు ఉన్నాయని.. ఇక మీద అటువంటి వాటికి ఆస్కారం ఉండని విధంగా సీఎం కేసీఆర్ కొత్త చట్టాన్ని పకడ్బందీగా రూపకల్పన చేసినట్లు సమాచారం. రెవెన్యూశాఖలో మ్యూటేషన్ దగ్గర నుంచి భూముల క్రయవిక్రయాలు.. రెవెన్యూ వ్యవస్థలోని పనులు అంతా ఆన్ లైన్ లోనే చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తద్వారా అవినీతిని తెలంగాణలో లేకుండా చేయాలని యోచిస్తున్నారు.