అధికారాన్ని చేపట్టటం ఒక ఎత్తు. అధికారంలో కుదురుకోవటం మరో ఎత్తు. అన్నింటికి మించి పవర్ లో ఉంటూ.. ప్రజల మనసుల్లో కొలువు తీరటం అంత తేలికైన పని కాదు. ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రజా వ్యతిరేకత వెంటాడుతూ ఉంటుంది. దాన్ని అధిగమిస్తూ పాలించటం.. పాలనా పగ్గాలు ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండా ఉండేందుకు రాజకీయ అధినేతలు చాలానే చేస్తుంటారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మినహాయింపు కాదు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలిసిందే. తన జీవితకాలంలో సాకారం కాదని ఫిక్స్ అయి మరీ పోరాడిన కేసీఆర్.. ఊహించని రీతిలో తన స్వప్నం సాకారం అయితే.. ఆయన బలం ఎంత పెరుగుతుందో.. ఆయన మేధోతనం మరెంతో విస్తృతం కావటమే కాదు.. వ్యూహాలు పన్నటంలోనూ అమితమైన వేగంతో దూసుకెళుతున్నారు. ఇంతకాలం తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ.. తెలంగాణ జాతికి కొత్తస్ఫూర్తిని కలిగించిన కేసీఆర్.. ఇప్పుడా విధానానికి తెర దించనున్నారా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది.
పలు సంక్షేమ పథకాలకు ఆసక్తికరమైన పేర్లను పెట్టిన ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా తన పేరునే బ్రాండింగ్ గా చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు మరో రెండేళ్లకు వచ్చేస్తున్న వేళ.. రానున్నకాలంలో తన బ్రాండింగ్ మీద పలు సంక్షేమ పథకాల్ని అమలు చేసే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఇప్పటికే చంద్రబాబు పేరిట పలు సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఎందుకంటే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు గుర్తుకు వచ్చే ఎన్టీఆర్.. ప్రభుత్వ పథకాలకు.. ఆయనకు భారతరత్న లాంటి పురస్కారాలు వచ్చేలా చేసి.. ఆయన కీర్తిప్రతిష్టలు మరింత పెంచే ప్రయత్నాలు సరిగా చేయటం లేదన్న విమర్శ ఉంది. దీనికి తగ్గట్లే.. పవర్ లో ఉన్న వేళ.. ప్రభుత్వ పథకాలకు ఎన్టీఆర్ పేరు స్థానే.. తన పేరును తీసుకు రావటం ద్వారా.. తనను తానో బ్రాండ్ గా మార్చుకుంటున్న వైనం కనిపిస్తోంది. దీనిని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకున్నా.. పైకి మాత్రం మాట మాట్లాడని పరిస్థితి.
ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. తెలంగాణలో తెలంగాణ ప్రముఖులకు గుర్తింపు లభించలేదని.. సీమాంధ్రుల పాలనలో ఎంతోమంది ప్రముఖుల్ని విస్మరించారని చెప్పే కేసీఆర్.. తన మూడేళ్ల పాలనలో (మరో మూడునెలలకు) ఎంతమంది తెలంగాణ ప్రముఖుల పేర్లతో పథకాలు చేప్టటారన్నది అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రముఖుల స్థానే.. తన పేరును పలు రకాలుగా తెర మీదకు తీసుకొచ్చి బ్రాండింగ్ చేసుకోవాలన్న తలంపులో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇందులో భాగంగా నవజాత శిశువులకు అవసరమైన వస్తువుల్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోంది. దాదాపు రూ.2వేలు విలువైన వస్తువులున్న ఈ కిట్ కు కేసీఆర్ పేరును పెట్టాలన్న ఆలోచనలో అధికారపక్షం ఉన్నట్లుగా చెబుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. తన బ్రాండింగ్ కు వచ్చే మైలేజీని చెక్ చేసుకొని.. మరిన్ని పథకాలకు తన పేరు మీద ఉండేలా కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల వేళ.. కేసీఆర్ బ్రాండింగ్ కు పెరిగే ఆదరణకు తగ్గట్లే.. ఓట్లు పడతాయన్నది మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/