గంటల కొద్దీ కేబినెట్ భేటీని నిర్వహించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటే. మీటింగ్ మొదలు పెట్టటమే కానీ ఎప్పుడు పూర్తి చేస్తారన్నది కేసీఆర్ చేతుల్లోనే ఉంటుంది. మారథాన్ మీటింగ్‌లను తెగ ఎంజాయ్ చేసే కేసీఆర్.. తాజాగా నిర్వహించిన కేబినెట్ మీటింగ్‌ను ఏకంగా ఏడున్నర గంటల పాటు నిర్వహించటం గమనార్హం. సాయంత్రం ఐదున్నర గంటలకు మొదలైన మంత్రిమండలి సమావేశం రాత్రి 11 గంటల వరకూ సాగింది. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు ఆసక్తికర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
ఏది ఏమైనా గ్రామ పంచాయితీలకు నిర్వహించాల్సిన ఎన్నికల్ని షెడ్యూల్ ప్రకారమే చేపట్టాలన్న నిర్ణయంతో పాటు గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేలా కొత్త పంచాయితీరాజ్ చట్టాన్ని రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయితీలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండే విధంగా నిబంధనల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు.
పరిపాలనా రంగంలో విశేష అనుభవం ఉన్న అధికారులు.. న్యాయనిపుణులతో సంప్రదించి కొత్త చట్టాన్ని రూపొందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కొత్త చట్టాన్ని రూపకల్పన చేసి ఈ నెల 27 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. గ్రామ పంచాయితీ చట్టం తీసుకొచ్చిన తర్వాత కొత్త పుర పాలన చట్టాన్ని తీసుకురానున్నట్లుగా సీఎం చెప్పారు.
కొత్త పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామాల్లో అద్భుతమైన.. గుణాత్మకమైన మార్పును ఆకాంక్షించిన కేసీఆర్.. గిరిజన తండాలు.. కోయ.. గోండు గూడేలు.. చెంచు పల్లెల్ని పంచాయితీలుగా మార్చాలని మంత్రిమండలి నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 5040 తండాలను 1759 గ్రామ పంచాయితీలుగా మార్చనున్నారు. పురపాలక సంఘాలు.. నగరపాలక సంస్థల్లో భవన నిర్మాణాలకు మూడు వారాల్లో అనుమతులు ఇచ్చేలా పురపాలక చట్టంలో సవరణలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
కొత్తగా ఏర్పాటు చేసే గ్రామపంచాయితీలకు నిధుల సమీకరణ విషయాన్ని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ లో పంచాయితీల జనాభా ఆధారంగా నిధులు ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తారు. జాతీయ ఉపాధి హామీ లాంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు కేంద్రం నుంచి నిధులు సమకూరుస్తారు. పన్నులు.. ఆర్థిక సంఘం ద్వారా నిధుల్ని సమకూర్చుకుంటారు. వీటితో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంస్థలు నిధుల్ని సమకూర్చుకుంటాయి.
కొత్త పంచాయితీలు.. కొత్త గ్రామ పంచాయితీల ఏర్పాటు చేసేందుకు ప్రధాన గామానికి ఉన్న దూరాన్ని.. శివారు పల్లెల జనాభాను.. భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చట్టం రూపకల్పన విషయంలో ఉదారంగా ఉండాలన్న మాట కేసీఆర్ నోటి నుంచి రావటం గమనార్హం.
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల్ని సిఫార్సు చేయటానికి ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు మంత్రిమండలి ఓకే చెప్పేసింది. రైతు సమన్వయ సమితులు.. వ్యవసాయ అధికారులను సమర్థంగా వినియోగించటం.. రైతు గిట్టుబాటు ధరలు కల్పించేలా మంత్రి పోచారం అధ్వర్యంలో మరో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డినెన్స్ లపై బిల్లులు ఆర్నెల్ల క్రితం జారీ చేసిన ఎనిమిది ఆర్డినెన్స్ ల స్థానంలో చట్టం చేయటానికి అనువుగా బిల్లుల్ని అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలని నిర్ణయించారు.
వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేసేందుకు వీలుగా ఉద్యోగ భర్తీకి ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించారు. దాదాపు 15వేల ఉద్యోగాల భర్తీ (8700 ఉపాధ్యాయ.. వైద్య విధాన పరిషత్ లో 4540 పోస్టులు.. సిద్దిపేట కొత్త మెడికల్ కాలేజీలో 931 పోస్టులు.. బీబీనగర్ నిమ్స్ లో 881.. 30 పడకలున్న ఐదు ఆసుపత్రుల్లో 80 పోస్టులు తదితరాలు) ఓకే చెప్పేశారు.