ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కేసీఆరే. ఆయనకు సాటి వచ్చే వారెవరూ ఉండరని చెప్పాలి. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ కేబినెట్ మీటింగ్ ను నాన్ స్టాప్ గా తొమ్మిది గంటల పాటునిర్వహించే సత్తా కేసీఆర్ ఒక్కరికే ఉందని చెప్పాలి. కదలకుండా మారథాన్ మాదిరి సాగే మంత్రివర్గ సమావేశాన్ని అన్నేసి గంటల నిర్వహించటం అంత మామూలు విషయం కాదు. ఎందుకంటే.. మంత్రుల్లో అనేకమంది పెద్ద వయస్కులు ఉండటం.. పలు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. వాటిని పక్కన పెట్టి.. కదలకుండా అలానే అన్నేసి గంటలు కూర్చోవటం మంత్రుల గొప్ప అయితే.. అలా కూర్చోబెడుతూ.. టైం అన్నది తెలీకుండా చేసే మేజిక్ సీఎం కేసీఆర్ కు మాత్రమే సొంతమని చెప్పాలి.
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలై కేబినెట్ భేటీ నిర్విరామంగా తొమ్మిది గంటల పాటు సాగింది. మ్యాట్నీ వేళ మొదలైన కేబినెట్ భేటీ సెకండ్ షో వదలటానికి కాస్త ముందు ముగించారు. అంటే.. ఒకేసారి మూడు సినిమాలు చేసేందుకు పట్టే టైం కంటే కాసింత ఎక్కువ టైంను మంత్రివర్గసమావేశాన్ని నిర్వహించారని చెప్పాలి.
వాస్తవానికి రాత్రి ఏడు గంటల వేళలో ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించాలని భావించారు. అందుకు తగ్గట్లే మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్లు భౌతికదూరంతో మీడియా సమావేశానికి ఏర్పాట్లు చేశారు. కానీ.. రాత్రి ఏడు గంటలకు కాస్త ముందుగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేద్దామనుకొని మరీ.. ఎందుకు వాయిదా వేశారన్నది అర్థం కాలేదు.
కానీ.. రాత్రి 11.30 గంటల వేళలో కేబినెట్ భేటీ ముగిసిన వైనం చూశాక.. మధ్యలో బ్రేక్ ఇవ్వటంఇష్టం లేకనే.. మీడియా సమావేశాన్ని రద్దు చేసినట్లుగా అర్థమవుతుంది. మీడియా సమావేశాన్ని 7 గంటలకు నిర్వహించాలని ముందు అనుకున్నారంటే.. దాదాపు నాలుగున్నర గంటలపాటు కేబినెట్ భేటీకి షెడ్యూల్ చేసి ఉంటారు. కానీ.. అది ఏకంగా అనుకున్న దాని కంటే డబుల్ సమయం.. అంటే.. తొమ్మిది గంటల పాటు సాగింది.
అనుకున్న సమయానికి కేబినెట్ భేటీ ఎందుకు పూర్తి కాలేదన్న విషయానికి వస్తే.. కొవిడ్ తాజా పరిస్థితుల మీద మంత్రి హరీశ్ రావు ప్రజెంటేషన్ ఇవ్వటం.. ఆ తర్వాత కరోనా పరిస్థితులు.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ ఆలోచన.. మూడో వేవ్ ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనా చర్చ జరిగినట్లు చెబుతారు. దీనికి తోడు.. ఒకసారిచర్చ మొదలైన తర్వాత.. కేసీఆర్ అలా మాట్లాడుతూ ఉండటం.. మధ్యలో ఆయన మాటలకు బ్రేక్ వేసే సాహసం ఎవరూ చేయలేకపోవటం కూడా మారథాన్ మీటింగ్ కు కారణంగా చెబుతారు.
దీనికి తోడు సోమవారం నిర్వహించిన కేబినెట్ భేటీలో.. చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉండటం.. వాటిని చర్చించే సమయంలో ఇతర అంశాలు చర్చలోకి రావటం కూడా దీనికి కారణమన్న మాట వినిపిస్తోంది. ఏమైనా... కేబినెట్ మీటింగ్ ను ఇన్నేసి గంటల పాటు కొనసాగించటం సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.