రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు టీవీలు చూడండి.. నిరుద్యోగుల‌కు కేసీఆర్ పిలుపు

Update: 2022-03-08 14:32 GMT
అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పనున్నారు. ఉద్యోగాల‌ భర్తీపై కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులందరూ బుధవారం ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.

అసెంబ్లీ వేదికగా తాను నిరుద్యోగులకు శుభవార్త చెబుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఇప్పటికే ఖాళీల వివరాలను  సీఎం కేసీఆర్‌కు చీఫ్ సెక్రటరీ అందజేశారు. మరో 30 వేల ఖాళీలను కూడా భర్తీ చేయునున్నట్లు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పనున్నారు.   ఇక ఖాళీల భర్తీ కోసం 4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. కేసీఆర్ ప్రకటన ఎలా ఉండబోతోందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణలో ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని సీఎం కేసీఆర్‌ అన్నారు. జిల్లాలోని నాగవరం బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, వనపర్తి.. జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని.. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.

'గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవి. తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా లేదు. తెలంగాణ వచ్చాక మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైంది. పాలమూరు జిల్లా పాలుగారుతోంది. హైదరాబాద్‌ నుంచి గద్వాల దాకా ధాన్యపు రాశులతో కళకళలాడుతోందని'' సీఎం అన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. పాలమూరు ప్రాంత అభివృద్ధి క్సోం నిరంజన్‌రెడ్డి ఎంతో కష్టపడి పనిచేశారు. నిరంజన్‌రెడ్డి ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవాలని సీఎం పేర్కొన్నారు. రేపు(బుధవారం) అసెంబ్లీలో తాను ఓ కీలక ప్రకటన చేయబోతున్నానని కేసీఆర్‌ తెలిపారు. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కోరుతున్నానన్నారు.
Tags:    

Similar News