బీఎస్పీతో భాగస్వామ్యం పట్ల పవన కళ్యాణ్ తెగ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే... దేశంలో కోట్లాది మంది మాయావతి ప్రధాని కావాలని కోరుతున్నారని, వారిలో నేనూ ఒకడని పవన్ వ్యాఖ్యానించారు. 2008లో మరి రాజకీయాలే తెలియని పవన్ ను మాయావతి పిలిచిందట. మరి అప్పట్లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు కాబట్టి ప్రూఫ్ ఏమీ లేదు. ఏపీ అధ్యక్షుడిగా ఉండమని పవన్ ను మాయావతి ఎలా ఎంపిక చేసిందో పవన్ కూడా చెప్పలేదు. మొత్తానికి తనకిష్టమైన పార్టీతో పవన్ పొత్తు పెట్టుకుని ఖుషీ అవుతున్నారు.
ఆ పొత్తు లెక్కలు తేల్చుకోవడానికి మాయావతి బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ ను ఏపీకి పంపారు. ఆయనతో పాటు ఇంకొందరు కూడా వచ్చారు. వారితో చర్చలు సఫలం అయ్యాయి. అలాగే వామపక్షాలతో జనసేన చర్చలు కొనసాగుతున్నాయి. వారు కూడా పెద్ద సంఖ్యలో సీట్లు అడుగుతున్నారు. ఆ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
పొత్తు లెక్కలు
బీఎస్పీ - 3 లోక్ సభ, 21 అసెంబ్లీ
సీపీఐ - 2 లోక్ సభ, 13 అసెంబ్లీ
సీపీఎం- 2 లోక్ సభ 14 అసెంబ్లీ
ఈ పొత్తు చర్చల్లో జనసేన కేంద్ర కార్యాలయంలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధులతో నాదెండ్ల భేటీ అయ్యారు. సీపీఎం అడిగిన సీట్లపై జనసేన సానుకూలంగా స్పందించింది. కాకపోతే సీపీఐ అడిగిన సీట్లలో కొన్నింటిని మార్చుకోవాలని జనసేన కోరుతోంది. విజయవాడ పశ్చిమ స్థానం కోసం సీపీఐ నేతలు గట్టిగా పట్టుపట్టారు. సీపీఐ నగర కార్యదర్శి డి.శంకర్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఇక కేసీఆర్ పై ఈ ఎన్నికల ప్రచారంలో జనసేనాధిపతి మరోసారి విమర్శలు చేశారు. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రిని ఒక దళితుడిని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని, దానిని కేసీఆర్ నిలుపుకోలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇటీవలే ఏపీలో వేలు పెట్టొద్దు అంటూ పవన్ కేసీఆర్‌కు దండం పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయనను ప్రస్తావించారు.
ఇక మాయావతి స్వాతం గురించి పవన్ ప్రస్తావించారు. మాయావతి ఎంతో ప్రేమ పూర్వకంగా సాదరస్వాగతం పలికారన్నారు. లక్నోలో మాయావతి చూపిన ప్రేమ, ఆప్యాయత తనను కదిలించిందని పవన్ వ్యాఖ్యానించారు.