తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు రాష్ట్ర విభజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ ఇటు ఏపీ ఏర్పాటు అటు రాష్ట్ర విభజనపై ఆయన తన ఉద్యమకాలం నాటి వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. 2014 జూన్ 2 నాటికి తెలుగు ఐడెంటిటి విభజన అవుతున్నదన్న ఆందోళన - బాధ ఉండేది. ఆంధ్ర ఉద్యోగులు రాజధాని నుంచి విడిపోతున్న ఆవేదనతో ఉన్నారు. దీనిపై మీరేమైనా చింతిస్తున్నారా అని ప్రశ్నించగా....`రాజ్ దీప్... మీరు చెబుతున్నట్లు తెలుగు ఐడెంటి అన్నదేమీ లేదు. ఆ వాదన సరికాదు` అని కేసీఆర్ అన్నారు.
`ఆంధ్ర వేరు. తెలంగాణకు ఉన్న గుర్తింపు వేరు. మా భాష - యాస - పండుగలు వేర్వేరు. 1956లో ఆంధ్రలో మా రాష్ట్రాన్ని విలీనం చేసే సందర్భంగా కూడా తెలంగాణవారు వ్యతిరేకించారు. అదో చారిత్రక తప్పిదం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే బ్లండర్ మిస్టేక్. అదో దురదృష్టం.. విఫలప్రయత్నం. ఇప్పుడు ఆంధ్ర ఓ సక్సెస్ స్టోరీ. ప్రస్తుతం ఈ ఏడాది మా బడ్జెట్ ప్రతిపాదనలే లక్షా 49వేల కోట్లు. మేం లక్షా 25వేల కోట్లు ఖర్చుచేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నపుడు క్యాపిటల్ ఎక్స్ పెండించర్ 15-20 కోట్లు దాటేది కాదు. అదే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ పెండెచర్ తెలంగాణలో 50వేల కోట్ల దాటింది` అంటూ తమ ప్రత్యేకతలను కేసీఆర్ వివరించారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన ఆంధ్రవారు - గుంటూరు - విజయవాడవారు తమ పెట్టుబడులను వెనక్కుతీసుకెళ్లలేదని...అంటే తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి వారికి క్రెడిట్ ఇస్తారా అని రాజ్ దీప్ ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గురించి అవగాహన ఉన్నవారికి ఫ్యాక్ట్ తెలుస్తుందని కేసీఆర్ వివరంగా తెలిపారు.
`తెలంగాణలో సంపద సృష్టి నిజాంకాలం నుంచే ఉంది. రాజస్థాన్ - గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి మార్వాడీలు తదితరులు వందల ఏళ్ల క్రితమే హైదరాబాద్ కు వచ్చారు. మీరు ఓల్డ్‌సిటీకి వెళ్తే గుల్జార్ హౌజ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ మార్వాడీలు 300 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు. వారు తెలంగాణ మా రాష్ట్రం అని చెబుతున్నారు. ఆంధ్రవారిలోని కొందరు ప్రత్యేక ఆలోచనలతో మాట్లాడుతుంటారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మా విజయం చూడండి. 150 సీట్లలో 144 స్థానాలను మేం, మా మిత్రపక్ష పార్టీ ఎంఐఎంతో కల్సి గెల్చుకున్నాం. మిగిలిన అన్ని పార్టీలు కలిపి ఆరుసీట్లు గెల్చుకున్నాయి. హైదరాబాద్ ప్రజల సంపూర్ణ మద్దతు టీఆర్ ఎస్ పార్టీకి, మా ప్రభుత్వానికి ఉన్నదని స్పష్టమవుతోంది కదా..?` అని ప్రశ్నించారు.