పాలిటిక్స్ లో ప్రత్యర్థిని దెబ్బ తీయటానికి మాటల్ని అస్త్రంగా వాడేస్తుంటారు. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త భిన్నం. ఆయన మాటలతో యుద్ధానికి దిగరు. ఆ మాటకు వస్తే.. తన ప్రత్యర్థుల్ని ఆయన కామెడీ పీస్ గా మార్చేస్తుంటారు. తన కంటే చాలా తక్కువ స్థాయి వారిగా తీసిపారేసే మాటలు ఆయన నోటి నుంచి వస్తాయి. మొత్తంగా.. తన ప్రత్యర్థి అని వాళ్లకు వాళ్లు చెప్పుకోవటమే కానీ.. తాను అసలు అనుకోవటం లేదన్నట్లుగా ఆయన మాట తీరు ఉంటుంది?
తనపై అదే పనిగా చెలరేగేవారి.. పేరును తన నోటితో తాను పలకటానికి బొత్తిగా ఇష్టపడరు సరికదా.. జనాల చేత ఆ నేత పేరు చెప్పించి.. కామెడీ చేసుకుంటారు. ప్రస్తుతానికి ఎలాంటి పంచాయితీ లేదు కానీ.. గతంలో తనపైనా..తన కుటుంబంపైనా అదే పనిగా విరుచుకుపడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఆ యాక్టర్ పేరేందంటూ వ్యాఖ్యానించటం చూసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. పవన్ కల్యాణ్ పేరు తెలీదా? అని.
కానీ.. అక్కడ అసలు పాయింట్ పవన్ కల్యాణ్ పేరు తెలీకపోవటం కాదు. అతగాడ్ని తాను లైట్ తీసుకుంటున్నానన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయటం. తాజాగా టీపీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్.. గడిచిన రెండు రోజులుగా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. చివరకు రేపొద్దున ఏదైనా మాట్లాడే అవసరమే వస్తే.. ఆ సందర్భంగా తన ప్రస్తావన తేకుండా ఉండలేని పరిస్థితిని తీసుకొచ్చారు.
మరి.. రేవంత్ పై కేసీఆర్ కామెంట్లు ఎలా ఉండబోతున్నాయి? తనను అదే పనిగా విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ విషయంలో ఆయన తీరు ఎలా ఉండబోతోంది? అన్నప్రశ్నలకు రాజకీయ వర్గాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఎప్పటిలానే.. రేవంత్ ను తీసిపారేసేలా మాట్లాడటం.. కామెడీ చేయటంతోపాటు.. ఆయన్ను సింఫుల్ గా తేల్చేసేందుకు.. ఓటుకు నోటు ఉదంతాన్ని ప్రస్తావింంచి.. యాభై లక్షల రూపాయిలతో కెమేరాలకు అడ్డంగా దొరికిపోయాడే.. ‘ఆ పోరడు పేరేంటి?’ లాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలు చేస్తారని చెబుతున్నారు.
ఓటుకు నోటు వ్యవహారాన్ని.. రూ.50లక్షలు ఇస్తూ దొరికిపోయిన వైనాన్ని ప్రస్తావించటం ద్వారా.. ‘అలాంటోడు నన్ను విమర్శించటమా?’ అన్న భావన కలిగేలా చేస్తారంటున్నారు. ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వ్యాఖ్యలు చేసే కేసీఆర్ కు రేవంత్ ఎలా సమాధానం చెబుతారన్నది ఆసక్తికరమని చెప్పక తప్పదు.