టీజేఎస్ రూపకర్త కోదండరాంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వకుండ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. రామగుండం నుంచి కోదడరాం పోటీ చేస్తారనే తెలియడంతో - అక్కడ తన కొడుకు కేటీఆర్ ను పంపి కోదండరాంను డ్యామేజ్ చేసేందుకు అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని ఆదేశించారట.
మహా కూటమిలో సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. రేపో మాపో అధికారిక ప్రకటన చేయనున్నారు. కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న టీజేఎస్ రూపకర్త కోదండం పోటీపై నిన్నటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అసలు ఆయన పోటీ చేయరని కూడా చెప్పుకొచ్చారు. తాజాగా కోదండరాం రామగుండం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఆ మేరకు సీటు కూడా కన్ఫాం చేసేశారట.
కోదండరాం విషయంలో టీఆర్ఎస్ నేత కేసీఆర్ బాగా వ్యతిరేకతగా ఉన్నారు. ఆయనను గెలవకూడదని - అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని పార్టీ నేతలకు చెప్పారట. రామగుండం వ్యవహారాలను నిశితంగా పరిశీలించాలని కేటీఆర్ ను పురమాయించారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా తెప్పించుకున్నారు కేసీఆర్. రామగుండంలో కోదండరాంకు అనుకూలంగా ఎవరు ఉన్నారు.. ఆయన క్యాంపెయినింగ్ కి వస్తున్న వారెవరు అన్న అంశాలను ఆరా తీశారు.
కాగా, కోదండరాంపై ఇంతలా నిఘా పెట్టిన కేసీఆర్ - గజ్వేల్ - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన దృష్టంతా ప్రధానంగా కోదండరాంపైనే ఎక్కువగా పెట్టినట్లు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా ఆయనకు కేవలం మూడు నుంచి ఐదు సీట్లు మాత్రమే కేటాయిస్తూ - రాజకీయంగా అంతలా ప్రభావం చూపనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. రామగుండంలో కోదండరాం స్థానికేతరుడని - ఆయనకు నియోజకవర్గ విషయాలపై అసలు అవగాహన లేదని ఇప్పటికే టీఆర్ ఎస్ తరుపున పోటీ చేస్తున్న సోమవరపు సత్యనారాయణ మాటల దాడి ప్రారంభించేశారు.
కోదండరాం ఓటమిపై కేసీఆర్ నజర్ పెట్టడం మహా కూటమిలోనూ పెద్ద చర్చ జరుగుతుంది. ఒకవేళ కోదండరాం గెలిస్తే చారిత్రాత్మకమవుతుందని అంటున్నారు. అసలు కోదండరాంపై ఎందుకు కేసీఆర్ కు అంత కక్ష అని వ్యాఖ్యానించుకుంటున్నారు. మరోవైపు కోదండరాం తన గెలుపునకు అవకాశం ఉన్న అన్ని అంశాలను సేకరించుకుంటున్నారు.