సార్వత్రిక ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ పేరిట టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేయబోతున్న కూటమి కేంద్రంలో అధికారం చేపట్టనుందా? ఆ వెంటనే టీఆర్ ఎస్ కు చెందిన నేతలు వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగానే కాకుండా వివిధ దేశాల్లో భారత రాయబరులుగానే సరికొత్త బాధ్యతలు స్వీకరిస్తారా? అంటే... అదేమీ సాధ్యం కాదని, తప్పనిసరిగా అవుతారని స్వయంగా కేసీఆరే చెబుతున్నారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో రెండో దఫా తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్... సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో 16 సీట్లను టీఆర్ ఎస్ గెలుస్తుందని చెబుతూ వస్తున్నారు. మిగిలిన ఒక్క సీటు కూడా తమ మిత్రపక్షం మజ్లిస్ కు దక్కుతుందని కూడా ఆయన పదే పదే చెబుతున్నారు. అంతటితో ఆగని కేసీఆర్... ఈ ఎన్నికల్లో బీజేపీయేతర - కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని - ఆ ప్రభుత్వం కూడా టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమేనని కూడా కేసీఆర్ చెబుతున్నారు.
జాతీయ పార్టీల ప్రభావం క్రమంగా సన్నగిల్లుతుండగా... టీఆర్ ఎస్ - వైసీపీ లాంటి పార్టీలు ఏ ఒక్కరూ ఊహించని స్తాయిలో విజయ ఢంకా మోగించనున్నాయని, ఆ తర్వాత ఈ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కూడా కేసీఆర్ లెక్కలేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఈ మాటలు చెప్పిన కేసీఆర్... గురువారం నాడు ఖమ్మంలో నిర్వహించిన టీఆర్ ఎస్ ఎన్నికల ప్రచార సభలో మరో అడుగు ముందుకేసి... ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలను కూడా వివరించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇకపై టీఆర్ ఎస్ నేతలు పలు రాష్ట్రాలకు గవర్నర్లుగానూ - పలు దేశాల్లో భారత రాయబారులుగానూ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గుణాత్మక మార్పులు రావాలంటే ఎన్డీఏ - యూపీఏ కాకుండా ఇతర పార్టీలు అధికారంలోకి రావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ - కాంగ్రెస్సేతర పార్టీలే అధికారం చేజిక్కుంచుకోనుందని కూడా ఆయన స్పష్టం చేశారు. బీజేపీ - కాంగ్రెస్ కలిసినా కూడా ఆ పార్టీలు ఉమ్మడిగానూ అధికారం చేజిక్కుంచుకునే అవకాశాలు కూడ లేవని అన్నారు.
ఈ నేపథ్యంలోనే టీఆర్ ఎస్ పార్టీ నుండి ఈసారి గవర్నర్లు - భారత రాయబారులు సైతం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ పార్టీ నుండి ఎమ్మేల్యేలు - ఎంపీలు - మంత్రులు - ముఖ్యమంత్రులు - కేంద్రమంత్రులు కూడ అవుతారని వీటితో పాటు గవర్నర్లు - విదేశీ రాయబారులు సైతం అవుతారని తాను గతంలోనే పార్టీ శ్రేణులకు చెప్పానని గుర్తు చేశారు. దేశంలోని అనేక పార్టీలతో మాట్లాడిన తర్వాత తాను ఈ మాటలు చెబుతున్నానని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి స్వంతగా 130 నుండి 140 స్థానాలు దాటవని పేర్కొన్న కేసీఆర్... అలాగే ఏన్డీఏ కూటమీకి కూడ 160 సీట్లు మాత్రమే దక్కుతాయని అన్నారు .మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం 100 స్థానాల లోపే స్థానాలను కైవసం చేసుకుంటుందని పలు సర్వేలు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. మొత్తంగా గవర్నర్లు - రాయబారులుగా టీఆర్ ఎస్ నేతలు కొత్త బాధ్యతలు చేపట్టనున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్... కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ దేనని చెప్పినట్టైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.