తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగ్ర రూపం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా అంశం మీద ఫోకస్ చేస్తే దాని అంతు చూసే వరకూ వదిలిపెట్టని కేసీఆర్ వైనం అందరికి తెలిసిందే. అయినా ఆక్రమ కట్టడాల కూల్చివేత లాంటి అంశాల మీద ఇంత తీవ్రంగా నిర్ణయాలు తీసుకున్నది లేదు. ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసానికి తెర తీయలేదని చెప్పాలి. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించిన కేసీఆర్.. గురుకుల ట్రస్ట్ భూముల్లో నిర్మించిన కట్టడాల కూల్చివేతను షురూ చేసినా..రెండు భవనాల తర్వాత కూల్చే ప్రోగ్రాంను పోస్ట్ పోన్ చేసుకున్నారు.
దాని తర్వాత ఆ అంశం మీద ఆయన పెద్దగా స్పందించింది లేదు. అయితే.. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు.. దాని కారణంగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం కావటమే కాదు.. విశ్వనగరం అంటే ఇదేనా అంటూ సోషల్ మీడియాలో వెటకారాలు.. హైదరాబాద్ కు సముద్రాన్ని తీసుకొచ్చేశారన్న తరహా వ్యంగ్య వ్యాఖ్యలు కేసీఆర్ కు ఎక్కడో కాలేలా చేశాయన్న మాట వినిపిస్తోంది.
సమస్యను సమస్యగా చూసే గుణానికి తోడు.. దాని పరిష్కారం కోసం ఎంతవరకైనా సరే.. అన్నట్లుగా వ్యవహరించే తీరు కేసీఆర్ లో ఎక్కువే. కానీ.. దాన్ని ప్రాక్టికల్ గా చూపించింది ఇప్పటివరకూ అయితే లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినేలా ఇటీవల కురిసిన వర్షాలు చోటు చేసుకోవటంతోతన మార్క్ ను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని కేసీఆర్ అర్థం చేసుకున్నారు.
స్వపక్షం - విపక్షం - స్నేహితులు - తెలిసినోళ్లు... ఎవరైనా సరే అక్రమం.. అక్రమమే. ఆ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించటం మొదలెట్టారు. ఇందుకు తగ్గట్లే హైదరాబాద్ మహానగరంలో నాలాల మీద కట్టిన కట్టడాలను ఒకటి తర్వాత ఒకటిగా కూల్చివేస్తూ అధికారులు సాగుతున్నారు. ఈ కూల్చివేతల పర్వం రెండో రోజూ నిరాటంకంగా సాగిపోయింది. తొలిరోజు రాజకీయ నేతల జోక్యంతో అక్కడక్కడా ఆగినా.. రెండో రోజు మాత్రం అక్రమ కట్టడాల్ని కూల్చే అధికారుల్ని అడ్డుకునే సాహసం ఎవరూ చేయలేకపోయారు. దీంతో.. మంగళవారం ఒక్క రోజులోనే నాలాలపై ఉన్న 25 నిర్మాణాలను.. మరో 43 అనధికార భవనాల్ని కూల్చివేశారు. ఈ కూల్చివేతల పర్వం నగరంలో ఏ ఒక్క ప్రాంతంలో కాకుండా.. అన్ని ప్రాంతాల్లోనూ కూల్చివేతలు స్టార్ట్ చేయటం.. వెనుకా ముందు చూసుకోకుండా రూల్ బుక్ కు తగ్గట్లుగా లెక్క చూసుకొని కొట్టేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే తీరులో కూల్చివేతలు కానీ పూర్తి అయితే.. కేసీఆర్ అనుకున్నట్లు అక్రమ కట్టడాలు మరికొద్ది రోజుల్లో కనిపించకుండా పోవటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/