270 సెక‌న్ల‌లో అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం!

Update: 2018-09-06 10:59 GMT
కేసీఆర్ తీరు ఎలా ఉంటుంది?  ఆయ‌న త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు ఎంత‌టి విలువ‌నిస్తారు?  ఆయ‌న కేబినెట్ లో ప్ర‌జాస్వామ్య వాతావ‌ర‌ణం ఎంత ఉంటుంది?  ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ల‌భించే స‌న్నివేశం తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేసే అంశాన్ని కేబినెట్ లో ఎంత‌సేపు చ‌ర్చించారు.

త‌న నిర్ణ‌యాన్ని మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు ఎంత‌సేపు వివ‌రించారు? ఏ కార‌ణంతో తానీ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ది ఏమైనా చెప్పారా? అంటే.. లేదంటే లేద‌న్న మాట చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేస్తున్న నిర్ణయాన్ని మంత్రివ‌ర్గానికి కేసీఆర్ చెప్ప‌టం.. దానికి మంత్రివ‌ర్గం ఓకే అన‌టం మొత్తం 4.30 నిమిషాల్లోనే పూర్తి కావ‌టం గ‌మ‌నార్హం. అంటే.. ఒక పాట కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే కేబినెట్ స‌మావేశం ముగిసింద‌ని చెప్పాలి.

కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని స‌హ‌చ‌రుల‌కు చెప్పి.. మీకేం ఫ‌ర్లేదు.. త‌న ద‌గ్గ‌రున్న వ్యూహాన్ని అంతోఇంతో చెప్ప‌టం లాంటివేమీ చేయ‌కుండా సింఫుల్ గా ర‌ద్దు వ్య‌వహారాన్ని చెప్పేసి.. మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని ముగించేశారు.  త‌న మీద త‌న‌కున్న న‌మ్మ‌కం.. త‌న మాట‌కు ఎదురు స‌మాధానం చెప్పే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో పాటు.. త‌న తోటి వారి అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా త‌న మాట‌ను చెప్పేసి స‌మావేశాన్ని క్లోజ్ చేశార‌ని చెప్పాలి.  మ‌రే ముఖ్య‌మంత్రి కూడా చేయ‌లేని రీతిలో కేవ‌లం 270 సెక‌న్ల వ్య‌వ‌ధిలో త‌న నిర్ణ‌యాన్నిచెప్పేసి.. స‌మావేశాన్ని క్లోజ్ చేయ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News