బీజేపీ నేతల మీద కేసీయార్ కుమార్తె పరువు నష్టం దావా

Update: 2022-08-22 16:30 GMT
ఆమె తెలంగాణా ఉద్యమ నేత కేసీయార్ కుమార్తె. తండ్రికి అసలు సిసలు వారసురాలు. మరి తన మీద ఆరోపణలు చేస్తే ఊరుకుంటారా అవి తప్పు అని మీడియా ముందు ఖండిస్తే అందరి లాంటి వారే అవుతారు. అందుకే ఆ కధ ఏంటో తేల్చుకోవాలని పరువు నష్టం దావా వేశారు.  తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు నిరాధారమైన ఆరోపణలు చేసి తనను ఇబ్బంది పెట్టారని  అంటూ ఎమ్మెల్సీ కూడా అయిన  కవిత  పరువునష్టం కేసు వేశారు.

ఆమె ఇంతకీ ఈ విధంగా రియాక్ట్ కావడం వెనక బీజేపీ నాయకుల పరుషమైన ఆరోపణలు కారణం. ఈ రోజు దేశంలో సంచలనం కలిగిస్తున్న లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రమేయం ఉందని అంటున్నారు. అలాగే  కోట్లాది రూపాయల మద్యం పాలసీ కుంభకోణం కేసు ఇదని కూడా పేర్కొంటున్నారు. అయితే ఇంత పెద్ద స్కామ్ లో  కవిత పాత్ర కూడా ఉందని ఆరోపించిన ఇద్దరు భారతీయ జనతా పార్టీ నేతలపై ఆమె పరువు నష్టం దావా వేశారు. ఆ ఇద్దరు బీజేపీ నాయకులు ఢిల్ల్లీలో మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో కేసీయార్ ఫ్యామిలీ భాగస్వామ్యం ఉందని అన్నారు.

ప్రత్యేక విమానంలో కేసీయార్ ఫ్యామిలీ ఢిల్లీ వచ్చిందని, ఈ డీల్ అంతా ఒక హొటల్ లో సాగిందని కూడా వారు  పేర్కొన్నారు. ఈ విధంగా నేరుగా కేసీయార్ ఫ్యామిలీ అని చెప్పడమే కాదు, కవిత పేరుని కూడా ప్రస్థావించడంతో వెంటనే మీడియాతో మాట్లాడి కవిత తన మీద చేసిన ఆరోపణలను  ఖండించారు.

తన మీద తన తండ్రి తెలంగాణా సీఎం కేసీయార్ మీద బీజేపీ నాయకులు ఈ తరహా ఆరోపణలు చేయడం వెనక రాజకీయ దురుద్ధేశ్యాలే ఉన్నాయని అన్నారు. కేసీయార్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దుర్విధానాలను ఎండగడుతునారనే టార్గెట్ చేశారని అన్నారు. ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని అలాగే విచారణ సంస్థలన్నీ వారి వద్దే ఉన్నాయని కవిత అన్నారు.

కేవలం ఆరోపణలు చేయడం కాకుండా విచారణ జరిపితే తాను తప్పక సహకరిస్తాను, తన నిజాయతీ నిరూపించుకుంటాను అని ఆమె చెప్పారు. ఇక దేశంలో అనేక కీలకమైన ప్రజా  సమస్యలు ఉన్నాయని వాటి నుంచి దృష్టి మళ్ళించడానికే ఇపుడు ఈ లిక్కర్ స్కాం అంటూ తీసుకుని వచ్చారని ఆమె ఆరోపించారు.

ఇకమీదట ఈ లిక్కర్ స్కాం విషయంలో తన మీద ఎలాంటి ఆధారం లేకుండా ఇక మీదట ఆరోపణలు చేయకుండా నిరోధించాలని ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ కవిత  పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో రాజకీయం అనారోగ్యకరమైన స్థితికి  వెళ్తోందని అనడానికి తమ కుటుంబం మీద బీజేపీ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలే ఉదాహరణ అని ఆమె అన్నారు.
Tags:    

Similar News