కోట్లాది మంది ప్రజలు విపరీతంగా అభిమానించి..ఆరాధించే అధినేత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు రాకుండాఉండటం ఈ మధ్యన ఎక్కువైంది. పెద్ద అనారోగ్యమైతే.. ఆ వివరాలు బయటకు వస్తే ప్రజలు భయాందోళనలకు గురి అవుతారన్న వాదనను అర్థం చేసుకోవచ్చు. కానీ.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల విషయంలోనూ వివరాలు బయటకు రానివ్వకుండా ఉంచటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.
కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. చికిత్స చేయించుకోవటానికి ఆయన ససేమిరా అంటున్నట్లు చెబుతారు. ఆ మధ్యన కంటి ఆపరేషన్ కోసం పలు మార్లు ఢిల్లీకి వెళ్లి.. చివరి నిమిషంలో తిరిగి రావటం తెలిసిందే. అంత పెద్ద కేసీఆర్ కు ఉన్న చిన్నపాటి భయాల గురించి చెబితే నమ్మలేం కానీ నిజమని చెబుతారు ఆయన సన్నిహితులు.
సూదిమందు అంటే కేసీఆర్‌కు విపరీతమైన చిరాకని చెబుతారు. అదే సమయంలో ఏదైనా సర్జరీ అంటే కూడా ఒక పట్టాన ఓకే చెప్పరని చెబుతారు. నడిచిపోతుంది కదా.. నడవనీ అంటారే తప్పించి.. శస్త్రచికిత్స అంటే వెనకడుగు వేస్తారని చెబుతారు. దవడ పంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయనకు శస్త్ర చికిత్స చేయాలి. అందుకుకేసీఆర్ సుముఖంగా లేకపోవటంతో ఆయనకు చికిత్స ఆలస్యమైందని చెబుతారు.
నొప్పి నివారణ కోసం ప్రయత్నాలు చేసినా. ఫలితం లేకపోవటంతో శస్త్రచికిత్స తప్పలేదని తెలుస్తోంది. శస్త్ర చికిత్స చేసుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని.. నొప్పితో అదే పనిగా బాధ పడే బదులు శస్త్ర చికిత్స చేయించుకుంటే సమస్య పరిష్కారమవుతుంది కదా అంటూ చెప్పిన మాటలకు కేసీఆర్ చివరకు తలొగ్గినట్లుగా తెలుస్తోంది.
గడిచిన కొన్ని రోజులుగా కేసీఆర్ బయటకు రావటం లేదు. ఎందుకిలా అన్న విషయాన్ని కొన్ని రోజుల క్రితమే తుపాకీ తన కథనంలో చెప్పింది. పంటి సమస్యతో కేసీఆర్ బాధ పడుతున్నారని.. ఢిల్లీలో ఆపరేషన్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది. ఢిల్లీకి కేసీఆర్ వెళుతున్నట్లుగా ప్రధాన మీడియా లోవార్తలు వస్తే.. ఆయన ఢిల్లీ టూర్ డెంటల్ సర్జరీ కోసమని తుపాకీ మాత్రమే చెప్పింది.
తాజాగా కేసీఆర్ దంత శస్త్ర చికిత్స సక్సెస్ అయినట్లుగా అన్ని మీడియాలలోనూ వార్తలు వచ్చాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన ఒక ఆసుపత్రిలో కేసీఆర్ దంత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయినట్లుగా వార్తలు వచ్చాయి. సోమవారం ఆయన శస్త్రచికిత్స తీసుకున్నారని.. రెండు రోజుల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని.. దీంతో ఆయన ఢిల్లీలోనే ఉండనున్నట్లు చెబుతున్నారు. విశ్రాంతి అనంతరం అంతా ఓకే అన్న తర్వాతే కేసీఆర్ హైదరాబాద్ కు వస్తారని తెలుస్తోంది.