దీర్ఘకాలికంగా కొనసాగి...ఊహించని రీతిలో ఫుల్ స్టాప్ పడి..శుభం కార్డు విషయంలో అస్పష్టతతో ఉన్న ఆర్టీసీ సమ్మె విషయంలో...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి - సమస్యకు ముగింపు పలికే దిశగా రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదిశగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేబినెట్ సమావేశం ప్రారంభంలోనే మంత్రివర్గ సహచరులకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కామెంట్లకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియని పరిస్థితి ఎదురైందని అంటున్నారు.
కేబినెట్ సమావేశం ప్రారంభంలోనే ఆర్టీసీ నిర్ణయం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. `` ప్రభుత్వం వద్దని చెప్తున్నా వినకుండా ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు నమ్మి సమ్మెకు దిగారు. పండుగల సమయంలో సమ్మెకు దిగడంతో అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు.. ఈ అంశాన్ని రెండువారాల్లోపు లేబర్ కోర్టుకు అప్పగించాలని కార్మికశాఖ కమిషనర్ కు సూచించింది. అలాగే.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రవాణా చట్టం ప్రకారం రూట్ల ప్రైవేటీకరణ - పర్మిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో...ఏం నిర్ణయం తీసుకుందాం? ఇంతకీ ప్రజలు ఆర్టీసీ సమ్మెపై ఏమనుకుంటున్నారు? మనం ఎలాంటి నిర్ణయం తీసుకుందాం?``అని మంత్రులను కేసీఆర్ అడిగినట్లు తెలుస్తోంది.
కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మెకు వెళ్లారని - ఆర్టీసీని నడిపే పరిస్థితి లేదని వాదిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడు పరిస్థితి గురించి ఆరాతీయడం....ఆ నిర్ణయం విషయంలో తమను భాగస్వామ్యం చేయాలనుకోవడంపై పలువురు మంత్రులు షాక్ తిన్నట్లు సమాచారం. వాస్తవ పరిస్థితులు చెప్పాలా...ఒకవేళ చెప్తే ఆయనెలా స్వీకరిస్తారు? ఇప్పటికే ముఖ్యమంత్రి ఆర్టీసీ విషయంలో నిర్ణయం తీసుకున్నారు కదా అనే మీమాంసలో పడిపోయి...ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.