తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ అసమ్మతి నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన అనూహ్యంగా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రావడంతో టీఆర్ ఎస్ నేతలు అవాక్కయ్యారట. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేయడం.. ఆయనకు డీఎస్ మద్దతివ్వడం తెలిసిందే. అదే స్థానంలో టీఆర్ ఎస్ బాస్ కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు అరవింద్ చేతిలో కవిత ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందే డీఎస్ పై చర్య తీసుకోవాలంటూ కవిత తన తండ్రి కేసీఆర్ ను కోరారు. ఆ పరిణామల నేపథ్యంలో డీఎస్ పార్టీ మారుతారని అంతా భావించారు. అయితే, ఆయన పార్టీ మారకపోయినా పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడిలా ప్రత్యక్షమయ్యారు.
కేసీఆర్, టీఆర్ ఎస్ లకు పూర్తిగా దూరమైన డీఎస్ ఇప్పుడిలా పార్టమెంటరీ పార్టీ సమావేశానికి రావడం వ్యూహాత్మకమేనని చెబుతున్నారు. పార్టీకి దూరంగా ఉంటూ.. పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడం లేదు కాబట్టి ఆయన తమ పార్టీకి చెందరని పేర్కొంటూ సభ్యత్వం రద్దు చేయాలని టీఆర్ ఎస్ ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని తెలుసుకుని ఆయనిలా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కేసీఆర్, డీఎస్ ల మధ్య తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే సంబంధాలు పూర్తిగా చెడ్డాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు డిఎస్‌పై నాలుగు పేజీల ఫిర్యాదుతో లేఖను కేసీఆర్ కు పంపారు. ఈ లేఖపై డిఎస్ మండిపడ్డారు. ఆ తర్వాత డిఎస్ తనయుడు సంజయ్ పై ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై కూడ తమ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టారని కూడ డిఎస్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎస్ అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో డిఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా నిజామాబాద్ నుండి పోటీ చేసి కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించారు.
డీఎస్ తాజా చర్యతో ఆయన ప్రస్తుతానికి బీజేపీలో చేరకపోవచ్చని భావిస్తున్నారు. అయితే... టీఆర్ ఎస్ కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా డీఎస్ ఈ ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి డీఎస్ అనూహ్య రాకతో టీఆర్ ఎస్ నేతలు షాకయ్యారట.