రాష్ట్రపతిని పిలిచారు... గవర్నరును పిలిచారు... దాయాది ముఖ్యమంత్రి చంద్రబాబును ఇంటికెళ్లి మరీ ఆహ్వానించారు.. ఇప్పుడేమో ఆహ్వానం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరైనా రావొచ్చని ప్రకటన చేశారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న యాగానికి అందరూ ఆహ్వానితులేనట. ఈ నెల 23 నుంచి 5 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాగానికి ఇప్పటికే ఎందరో ప్రముఖును కేసీఆరే స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. మరెందరికో తన తరఫున ఆహ్వానాలు పంపించారు. అయితే.... సాధారణ ప్రజలు కూడా ఎలాంటి సంకోచం లేకుండా రావొచ్చని... తన పిలుపే ఆహ్వానంగా భావించి అందరూ రావాలని ఆయన తాజాగా ప్రకటించడంతో తెలంగాణ ప్రజల్లో ఉత్సాహం మొదలైంది.
ఎంతో ప్రాముఖ్యమున్న ఆయుత చండీయాగం కావడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తుండడంతో ఇప్పటికే ఎందరో వెళ్తే బాగుణ్నని అనుకుంటున్నారు. అయితే.. అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉంటాయేమోనని సంకోచిస్తున్నారు. కానీ, తాజాగా కేసీఆర్ అందరూ రావచ్చని ప్రకటించడంతో జనం పోటెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.