వాస్తు.. సహా ఇతర కారణాల నేపథ్యంలో పాత సెక్రటేరియెట్‌ను పక్కన పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ సుమారు.. 620 కోట్ల రూపాయల వ్యయంతో నూతన సచివాలయ్యాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అన్ని కలిసి వచ్చి ఉంటే.. అది ఇప్పటి ప్రారంభం కావాల్సి ఉండేది.
అయితే.. ఎమ్మెల్సీ కోడ్ రావడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఇదిలావుంటే.. తాజాగా ఈ సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం.
ఏప్రిల్ 30న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నూతన సచివాలయానికి వచ్చిన సీఎం... అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం సచివాలయం ప్రారంభోత్సవ తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరుగనుంది.
ఏప్రిల్ 30 అంటే.. వైశాఖ మాసం... ఆదివారం, శుద్ధ దశమి, మఖ నక్షత్రంలో నూతన సచివాలయ్యాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి ఇప్పటికే అంబేడ్కర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే.
అలాగే జూన్ 2న అమరవీరుల చిహ్నం ఆవిష్కరణ జరుగనుంది. ఇక, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు.
నూతన సచివాలయ నిర్మాణం నభూతో అన్నవిధంగా నిర్మించారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధు నిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది. సచివాలయం పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఎమ్మెల్యేలకు వసతి భవనాలు కూడా దీనిలో ఉన్నాయి. 2 వేల కార్లకు పార్కింగ్ సదుపాయం.. మీడియా హౌస్ పేరుతో ప్రత్యేక భవనాన్ని కూడా దీనిలోనే నిర్మించడం గమనార్హం.