పావ‌లా శ్యామ‌ల‌కు ఆ సాయ‌మేంటి కేసీఆర్‌

Update: 2016-01-18 12:59 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఓ గొప్ప గుణం ఉంది. ఆయ‌న వ‌ద్ద‌కు ఎవ‌రైనా క‌ష్టం వ‌చ్చింద‌ని వెళితే ఆయ‌న స్పందించే తీరు ఔరా అనిపించేలా ఉంటుంది. ల‌క్ష‌ల రూపాయిల్ని సాయంగా ప్ర‌క‌టించే ఆయ‌న దొడ్డ మ‌న‌సు ఎంత‌న్న‌ది గుర్తుకు రావాలంటే ఆ మ‌ధ్య ప్ర‌ముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తూ రూ.కోటి ఇవ్వ‌ట‌మే కాదు.. ఆమె టైటిల్ గెలిస్తే మ‌రో రూ.కోటి న‌జ‌రానాగా ఇచ్చేసి అంద‌రిని విస్మ‌యానికి గురి చేశారు.

అలాంటి కేసీఆర్ వ‌ద్ద‌కు ఎవ‌రైనా స‌మ‌స్య అని వ‌స్తే.. వారి బ‌తుకును మొత్తంగా మార్చేస్తుంటారు. తాజాగా సినీన‌టి.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌లు చిత్రాల్లో న‌టించి.. తెలుగువారికి సుప‌రిచితురాలైన పావ‌లా శ్యామ‌ల పేద‌రికం గురించి ఒక‌ప‌త్రిక‌లో క‌థ‌నాన్ని చ‌దివిన కేసీఆర్ క‌దిలిపోయారు. సీఎం క్యాంప్ ఆఫీసులో కూతురితో పాటు క‌లిసి శ్యామ‌ల‌కు రూ.20వేలు ఆర్థిక సాయంతో పాటు.. డబుల్ బెడ్ రూం ప్లాట్ కేటాయించాల‌ని అధికారుల్ని ఆదేశించారు. ఇక‌.. ప్ర‌తినెలా రూ.10వేలు చొప్పున పింఛ‌న్ ఇవ్వాలంటూ సాంస్కృతిక శాఖ‌కు ఆదేశాలు జారీ చేశారు. అన్ని బాగానే ఉన్నా.. కేసీఆర్ లాంటి వ్య‌క్తి రూ.20వేలు న‌గ‌దు సాయం ఇచ్చే క‌న్నా మ‌రికాస్త ఎక్కువ‌గా ఇస్తే బాగుండేద‌న్న అభిప్రాయం ఉంది. తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ఆమెకు చేయూత ఇచ్చేలా కొంత మొత్తాన్ని ఇచ్చి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News