తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో మరోమారు స్పందించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో రెండు గంటల పాటు ఏకదాటిగా మాట్లాడిన కేసీఆర్ తనదైన శైలిలో అనేక అంశాలపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితిని తెలంగాణలో చూస్తున్నమని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ది దివాళకోరు రాజకీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన విద్యుత్ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేయడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉండటంతో ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఒక్క రోజు కూడా చిత్తశుద్ధితో ఉద్యమం చేయలేదన్నారు. కాంగ్రెస్ నేతలను ప్రజలే తిరస్కరించారన్నారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో తమకే అధికారం వస్తుందని కాంగ్రెస్ ఆశించిందని.. అధికారం రాకపోవడంతో తెలంగాణ అభివృద్ధి చెందకుండా ప్రతి విషయంలో కాలు అడ్డం పెడుతున్నదని సీఎం కేసీఆర్ వాపోయారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా పనికిమాలిన కేసులను కాంగ్రెస్ నాయకులు పెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వమని అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యోగుల విలీనాన్ని అడ్డుకొని వాళ్ల ఉసురును కాంగ్రెస్ నాయకులు పోసుకున్నారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై ఇప్పటికే 164 కేసులు పెట్టారని తెలియజేశారు. సింగరేణి డిపెండెంట్ జాబులనూ వాళ్లు అడ్డుకున్నరన్నారు. కాంగ్రెస్ తీరుపై బాధేస్తున్నదని, తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నేతలకు కన్ను కుడుతున్నదని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హోంగార్డులకు రూ. 3 వేల జీతం ఇచ్చారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అర్థాకలితో హోంగార్డలు పని చేస్తున్న తీరును తానే స్వయంగా అప్పటి సీఎం కు చెప్పానని గుర్తు చేశారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో కష్టాలుపడుతున్నరని...విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి కాంట్రాక్టర్లు 15 శాతం కమిషన్ తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ తెలియజేశారు. ఈ నెల 10 న ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేసిన తర్వాత రాష్ట్రమంతా తిరుగుతానని సీఎం కేసీఆర్ అన్నారు. అప్పుడు కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలను ప్రజలముందే పెడతానని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ పిశాచి అని..నడిబజార్ లో కాంగ్రెస్ దుర్నీతిని ఎండగడుతామని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆనాడు ఫజర్ అలీ కమిషన్ వద్దన్నా బలవంతంగా కాంగ్రెస్ నేతలు ఏపీలో కలిపారని.. 1969 లో 400 మంది చావులకు కారణమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ లో ఇక బతకమన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ రాష్ట్రాన్నిచ్చిందని... అంతే కాని తెలంగాణ ప్రజలపై ప్రేమతో కాదన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై సలహాలివ్వమంటే కాంగ్రేసోళ్లు పారిపోయారని సీఎం అన్నారు. మూడేళ్ల నుంచి తాము నిబద్దతతో పని చేస్తుంటే.. వాళ్లు మాత్రం సొల్లు పురాణం చెబుతున్నారని ఆయన చెప్పారు. ప్రతి విషయానికి స్పందిస్తే బాగోదని వదిలేస్తే... పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు. మనుషుల్లా కాకుండా.. ఉన్మాదుల్లా కాంగ్రెసోళ్లు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చిన్నబుచ్చుకోవద్దని.. కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసినా.. ఉద్యోగులు ఏం బాధ పడొద్దని.. కోర్టు చెప్పిన దానికంటే ఇంక ఎక్కువే ఇవ్వడానికి తమ ప్రభుత్వం రెడీగా ఉందని కేసీఆర్ అన్నారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో కష్టాలుపడుతున్నరని...విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి కాంట్రాక్టర్లు 15 శాతం కమిషన్ తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ తెలియజేశారు. కాంట్రాక్టర్ల దోపిడి నుంచి విద్యుత్ ఉద్యోగులకు కాపాడటానికే వాళ్లను డిపార్ట్ మెంట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాం తప్ప వాళ్లను రెగ్యులరైజ్ చేస్తూ కాదని ఆయన స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది అబ్సార్ప్షన్ కాని క్రమబద్దీకరణ కాదన్నారు.
బీజేపీకి తామిచ్చేది అంశాల వారీ మద్దతు మాత్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు.రాష్ట్రంలో అసలు లెఫ్ట్ పార్టీలున్నాయా అని ప్రశ్నించారు. 300 సంఘాల వామపక్ష కూటమికి వరంగల్‌లో 350 ఓట్లు రాలేదన్నారు. వాళ్లు మాట్లాడితే మేం పట్టించుకోవాలా అన్నారు. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే వినేందుకు సిద్దంగా లేమన్నారు. జైరామ్ రమేశ్ చేసినవన్నీ నిరాధార ఆరోపణలేనని సీఎం కేసీఆర్ అన్నారు. జైరామ్ రమేష్ జీవితంలో ఎప్పుడైనా సర్పంచ్‌గా అయినా గెలిచాడా అని ప్రశ్నించారు. నేరెళ్ల ఘటనను దళితుల అంశంగా మార్చారన్నారు. దెబ్బలు తిన్న వారిలో ఒకరో ఇద్దరో దళితులున్నారన్నారు. స్థానిక పరిస్థితులు మీరాకుమార్‌కు ఏం తెలుసునని కేసీఆర్ అన్నారు. నేరెళ్ల ఘటనకు దళిత రంగు పులమడం సరికాదన్నారు. పబ్‌లు, గబ్బుల పాపం కాంగ్రెస్‌దేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో పేకాట, గ్యాంబ్లింగ్, గుడుంబాకు స్థానం లేదన్నారు. డ్రగ్స్ కేసులో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించామన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కేబినెట్ మంత్రి ఉన్నా వదలొద్దని చెప్పానన్నారు. ప్రభుత్వం చేసే ఒక్క మంచి పనినీ హర్షించే విజ్ఞత కాంగ్రెస్‌కు లేదన్నారు. డ్రగ్స్ వాడకం లిస్టులో తెలంగాణ లేదన్నారు. డ్రగ్స్ కేసులో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించానన్నారు.
‘పిల్’లపై కాంగ్రెస్‌వి పిల్లి శకునాలేనని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. అద్భుతాలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నారు. ఇలాగే ప్రవర్తిస్తే కనీసం సిట్టింగ్ స్థానాలను కూడా గెలుచుకోలేరన్నారు. సింగరేణి కార్మికుల నోరు కొట్టింది వీళ్లేనన్నారు. వారసత్వ ఉద్యోగాలు మేం ఇస్తుంటే కాంగ్రెస్ కోర్టుకెళ్లి రద్దు చేయించిందన్నారు. మేం ఏం చేసినా పిల్ వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు కుక్కలు, నక్కల్లా పీక్కు తిన్నారన్నారు. ముఖ్యమంత్రిని కదా అని గంభీరంగా ఉన్నానని, ఇకపై నిజమైన కేసీఆర్‌ను చూస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరెన్ని వెలికి ప్రయత్నాలు చేసినా తెలంగాణను అభ్యుదయ పథంలో నడిపే ఏకాగ్రతను మరల్చలేరన్నారు. ప్రజల దీవెనలు మావెంటున్నాయన్నారు. ఎన్ని కేసులు పెట్టినా అధిగమిస్తామన్నారు. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా బుద్ది రావడం లేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు బాధ పడాల్సిన పనిలేదన్నారు. హోంగార్డులకు న్యాయం చేస్తామన్నారు.