ఒకటి తర్వాత ఒకటిగా కలల్ని ఆవిష్కరించటం అంత తేలికైన విషయం కాదు. కల అని కొట్టిపారేయటానికి లేదు. ఎందుకంటే.. ఆ కల కనింది కేసీఆర్ కాబట్టి. ఆయన కనే కలల వెనుక ఎంతోకొంత అర్థం.. పరమార్థం ఉండి ఉంటుంది. దాదాపు ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ కలలు కన్నారు. దసరా అని ముహుర్తం కూడా పెట్టుకున్నారు. అనుకున్నట్లే అనుకున్న సమయానికి అనుకున్నది చేసేశారు. కాకుంటే.. మొదట కన్న కలకు.. చివర్లో ఆవిష్కృతమైన స్వప్నానికి మధ్య అంతరాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. మొదట అనుకున్నది చివరకు వచ్చేసరికి ఎందుకంతలా మారిందన్న ప్రశ్న వేస్తే.. సంతృప్తికరమైన సమాధానం రాకున్నా.. జనాలు కన్వీన్స్ అయ్యేలా చెప్పే సమర్థత సీఎం కేసీఆర్ సొంతమన్న విషయాన్ని మర్చిపోకూడదు.
కొత్త జిల్లాల కల పూర్తి అయిన వేళ.. ఈ అంశంపై తర్వాత ఏందన్న ప్రశ్నకు కేసీఆర్ చేతలతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు త్వరలో అభివృద్ధికి కేంద్రాలుగా మారుతాయని చెబుతున్నారు. జిల్లాల ప్రధాన కేంద్రాల మీద కేసీఆర్ తాజా కలల గురించి వింటే నోట మాట రాని పరిస్థితి. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాజాగా ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ - సీఎంవో కమ్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు - ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర - ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ - జీఏడీ కార్యదర్శి అదర్ సిన్హా - ఆర్ అండ్ బీ ఈఎన్ సీ గణపతి రెడ్డి లాంటి ప్రముఖులను అందులో భాగస్వాములను చేశారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్ ను సెట్ చేసిన ఆయన.. తన సరికొత్త కలల్ని ఆవిష్కరించారు.
ప్రతి జిల్లా కేంద్రానికి ఔటర్ రింగు రోడ్డును ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వ కార్యాలయాలు.. నివాస గృహాలు.. పరిశ్రమలు.. ప్రైవేటు కాంప్లెక్స్ లు లాంటివి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై సమగ్ర ప్రణాళిక ఉండాలన్న ఆయన.. ప్రతి జిల్లా కేంద్రం అతి త్వరలోనే అభివృద్ధి కేంద్రాలుగా మారిపోతాయన్న ఊహను ఆవిష్కరించారు. ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థల్ని ఏర్పాటు చేసే అంశాల్ని పరిశీలించాలని చెప్పారు.
మరికాస్త వివరంగా అర్థం కావాలంటే.. సదరు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటను అండర్ లైన్ చేసుకొని మరీ చదివితే విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆ మాటేమిటంటే.. ‘‘సమగ్ర పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనేలా ప్లాన్ చేయాలి. హెచ్ ఎండీఏ.. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ తరహాలో ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థల్ని ఏర్పాటు చేసే అంశాల్ని పరిశీలించాలి. పట్టణాల పరిధిలోనే కాదు చుట్టూ దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో లేఅవుట్లు రూపొందించాలి’’ అని తన ఆలోచనల్ని అధికారులతో పంచుకున్నారు. ఈ మాటలు చెప్పటం ద్వారా.. అధికారులేం చేయాలన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారని చెప్పొచ్చు.
కొత్త జిల్లాల్ని ఏర్పాటుతోనే ఆయా జిల్లాల్లో రియల్ రేట్లను పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్న కేసీఆర్.. తాజాగా ఏర్పాటు చేయాలనుకుంటున్న పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో జిల్లా కేంద్రాల భూముల ధరల్ని ఎక్కడికో తీసుకెళ్లటమే కాదు.. భూముల కొనుగోలు డిమాండ్ పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ తీరు చూస్తే.. రానున్న రోజుల్లో ఈ తరహా కలలు మరిన్ని తెర మీదకు రావటం ఖాయం. మౌలిక సదుపాయాల ఏర్పాటు మాటను పక్కన పెట్టి.. సమగ్ర ప్రణాళికల పేరిట చేస్తున్న ప్రకటనలు చూస్తున్నప్పుడు.. కేసీఆర్ దృష్టి అంతా ‘రియల్’ మీదనే ఉందన్న అభిప్రాయాన్నిపలువురు వ్యక్తం చేస్తున్నారు. చెప్పొచ్చేదేమిటంటే.. కలలు కనే వాడికి కంటే.. ఆ కలల్ని విని.. ఏదేదో జరిగిపోతుందని భావించి తొందరపడే వాడే తీవ్రంగా నష్టపోతాడన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరమైతే ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/