సీఎం కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కగానే అనూహ్య సంచలన నిర్ణయాలతో పార్టీలోని అసంతృప్తులకు - ప్రత్యర్థి పార్టీలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నారు. మొదటి సారి సీఎంగా గద్దెనెక్కినప్పుడు ఆచితూచి.. ప్రశాంతంగా నిశ్చబ్ధంగా నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు రెండోసారి అఖండ మెజార్టీ సాధించడంతో దూకుడు పెంచారు. తను అనుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్ దృష్ట్యా పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. పార్టీని - ప్రభుత్వాన్ని వేగంగా ఏకకాలంలో ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో అఖండ మెజార్టీ సాధించగానే కేసీఆర్ తన ప్రత్యర్థి అయిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చాడు. తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చిన బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తానని రాజకీయ ప్రకంపనలు రేపారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు అనూహ్యంగా మహమూద్ అలీని తనతోపాటు ప్రమాణం చేయించి ఏకంగా కీలకమైన హోంమంత్రి పదవిని కట్టబెట్టి రాజకీయా వర్గాలకు - మీడియాకు షాకిచ్చారు. నాలుగు దశాబ్ధాల ఏపీ రాజకీయ చరిత్రలో ఓ ముస్లిం మైనార్టీకి హోంమంత్రిత్వ శాఖ కేటాయించి కేసీఆర్ సంచలనం రేపారు. చివరగా.. 1979లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి.. అప్పటి ముఖ్యనేత హషీమ్ కు హోంమంత్రి పదవిని కట్టబెట్టారు.
ఇక శుక్రవారం ఎవ్వరూ ఊహించని విధంగా కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి అందరికీ కేసీఆర్ షాక్ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి అత్యున్నత పదవులను ప్లీనరీ సమావేశాల్లో ప్రకటిస్తారు. కానీ టీఆర్ ఎస్ నేతలు - కార్యకర్తలకు కూడా అంతుబట్టని విధంగా ఈ నిర్ణయాన్ని సడన్ గా ప్రకటించారు. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ ఇలా ఆకస్మిక నిర్ణయాలు ఎన్నో తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
జనవరి నుంచి జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిపెడుతానని ప్రకటించడంతో జాతీయస్థాయిలో క్రియాశీల పాత్ర పోషించేందుకు వీలుగా తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ హడలెత్తిస్తున్న కేసీఆర్.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా కూడా అలానే ప్రకటిస్తాడేమోనన్న చర్చ సాగుతోంది.
ఈ పరిణామాలన్నింటిని జాగ్రత్తగా గమనిస్తున్న టీఆర్ ఎస్ సీనియర్లు - కార్యకర్తలు రెండోసారి అధికారంలోకి రాగానే ఇటీవల వచ్చిన రజినీ 2.0 సినిమాను చూపిస్తూ.. కేసీఆర్ ‘రీలోడెడ్ కేసీఆర్ 2.0’గా రూపాంతరం చెందాడని సంబరపడుతున్నారు.