రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన కేసీఆర్ .. పవన్ కల్యాణ్ భేటీ కి సంబంధించి ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ ఇద్దరు అధినేతల భేటీకి సంబంధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోన్నది.. పవన్ ను గంట వరకూ కేసీఆర్ వెయిట్ చేయించటం. సోసల్ మీడియాలోనూ.. కొన్ని టీవీ ఛానళ్లలో అయితే.. కేసీఆర్ ఇంట పవన్ వెయిటింగ్ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై ప్రత్యేక కథనాల్ని అందిస్తున్న వారు లేకపోలేదు.
ఇంతకీ.. కేసీఆర్ ఇంట పవన్ ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ గేమ్ ప్లాన్ లో పవన్ పులుసులో ములక్కాయలా మారారన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఇన్విటేషన్ పంపినప్పటికీ.. అప్పుడు హాజరు కాని పవన్.. తాజాగా జనవరి ఒకటో తేదీన అకస్మాత్తుగా ఎందుకు కేసీఆర్ ను కలవాలని అనుకున్నారు? దీని వెనుక కారణం ఏమైనా ఉందా? అంటే.. ఉందనే మాట వినిపిస్తోంది.
షెడ్యూల్ ప్రకారమైతే.. పవన్ తో భేటీ అన్నది కేసీఆర్ షెడ్యూల్ లో లేదని చెబుతున్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై భారీ ప్రకటనతో కొత్త సంవత్సరంలో ఉత్సాహంగా ప్రారంభించారు. అయితే.. ఈ పథకంపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదంరాం సునిశితంగా విమర్శిస్తూ ఒక నోట్ పంపారు. ఇది కానీ హైలెట్ అయితే తమకు కలిగే ఇబ్బంది ఎక్కువన్న భావన కేసీఆర్ క్యాంప్ లో మొదలైందని.. దృష్టి మరల్చేందుకే పవన్ ఎంట్రీ ఇచ్చేలా చేశారన్న మాట వినిపిస్తోంది.
తమ అవసరం కోసం పవన్ ను ముగ్గులోకి చాలా తెలివిగా దింపినట్లుగా చెబుతున్నారు. సీఎంకు విషెస్ చెప్పే ఆలోచనను.. ఆయనకు వచ్చేలా కామన్ ఫ్రెండ్స్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. వారి సాయంతో పవన్ వచ్చేలా చేయటం.. కేసీఆర్ ఉన్నారనుకొని ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయనకు వెయిటింగ్ తప్పలేదని చెబుతున్నారు. పవన్ రాకతో విషయం పూర్తిగా డైవర్ట్ కావటంతో పాటు.. కోదండం సారు ప్రిపేర్ చేసి పంపిన ప్రెస్ నోట్ ఏ మీడియాలోనూ హైలెట్ కాలేదన్న ఆరోపణ వినిపిస్తోంది. మొత్తంగా తమ అవసరం కోసం కేసీఆర్ క్యాంప్ పవన్ ను పులుసులో ములక్కాయ మాదిరి వాడుకుందని.. ఈ ఎపిసోడ్ లో కేసీఆర్ కంటే ఎక్కువ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది పవన్ కేనని చెబుతున్నారు. అంత ఇమేజ్ ఉన్న పవన్ సైతం కేసీఆర్ కోసం గంట సేపు వెయిటింగ్ చేయాల్సి రావటంతోనే.. సీఎం రేంజ్ ఏమిటో చెప్పకనే చెప్పినట్లుగా చెబుతున్నారు.