ఈసారికి కేకేకు ఢోకా లేదంటున్నారు

Update: 2020-02-18 18:30 GMT
టీఆర్ఎస్ సర్కిల్స్ లో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమైనా ఉందంటే.. అది ఎంపీ కేకేకు సీఎం కేసీఆర్ మరోసారి రాజ్యసభకు పంపుతారా? అన్నదే. త్వరలో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. తెలంగాణ కోటా కింద కేవలం రెండు సీట్లు మాత్రమే రానున్నాయి. ఇప్పుడున్న బలంతో రెండు సీట్లు టీఆర్ఎస్ సొంతం కానున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇచ్చేందుకు సారు డిసైడ్ కావటం తెలిసిందే.

రెండో సీటు ఎవరికి ఇస్తారన్నది ప్రశ్నగా మారింది. కేకే రేసులో ఉన్నా.. కవితతో పాటు.. చాలామంది ఆశావాహులు ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల వెలువడుతున్న సంకేతాలు కేకేకు సానుకూలంగా లేవన్న మాట వినిపిస్తోంది. అయితే.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన వాదన తెర మీదకు వచ్చింది. ఇటీవల జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి తగ్గట్లే.. ఆయన నోటి నుంచి జాతీయ అంశాలు అదే పనిగా ప్రస్తావిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఇవ్వాలంటూ కేకే లాంటి నేత చాలా అవసరం ఉంది.చాలామందికి పెద్దగా తెలీదు కానీ.. కేకేకు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో పెద్ద నెట్ వర్క్ ఉందని చెబుతారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన ఉన్న కేసీఆర్ కు.. కేకే అవసరం చాలానే ఉంటుంది. ఈ కారణంతోనే.. ఈసారికి మాత్రం కేకేకు రాజ్యసభ కు ఖాయంగా పంపించే వీలుందంటున్నారు.
Tags:    

Similar News