కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఊరికే అనరు. ఒకప్పుడు కాంగ్రెస్ నేతల అపాయింట్ మెంట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూ.. రోజులకు రోజులు ఢిల్లీలో కాలం గడిపిన కేసీఆర్ పాత రోజుల్ని అంత తేలిగ్గా మర్చిపోలేరేమో. తాను చేస్తున్న తెలంగాణ ఉద్యమంలో తీపి కబురు చెబుతానంటూ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ఆయన ఎన్ని తిప్పలు పడ్డారో ఆయన సన్నిహితులకు బాగానే ఎరుక.
తనదైన టైం కోసం ఓపిగ్గా ఎదురుచూసే కేసీఆర్.. ఒక్కసారి తన టైం వచ్చాక మాత్రం చెలరేగిపోతారు. ఒకప్పుడు ఏ పార్టీకి చెందిన నేతల అపాయింట్ మెంట్ కోసం తాను ఎదరుచూశానో.. ఇప్పుడు అదేపార్టీ ముఖ్యులకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా షాక్ ఇవ్వటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి భంగపడిన ప్రముఖులు చాలామందే ఉన్నారు. కమ్యూనిస్ట్ ల సహా విపక్షాలకుచెందిన పలువురు నేతలు కేసీఆర్ పేషీకి వచ్చి గంటల తరబడి వెయిట్ చేసి.. ఆయనతో భేటీకి అవకాశం లేక తిరిగి వెళ్లటం మర్చిపోకూడదు.
ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ నేతలు తీవ్ర విస్మయానికి గురి కావటమే కాదు.. ఇలాంటి పరిస్థితిని తాము ఎప్పుడూ ఊహించలేదన్న మాటను చెప్పేశారు. తాజాగా ఖమ్మంజిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి తమ దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీకి చెందిన ఎవరో ఒకరిని ఎన్నిక లేకుండా ఏకగ్రీవం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావించింది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ వివిద పార్టీలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ ను కోరారు.
తనను కలిసేందుకు టైం అడిగిన కాంగ్రెస్ నేతల విషయాన్ని తెలుసుకున్న ఆయన.. వారికి టైం ఇవ్వకుండానే.. తమ పార్టీ నేతలతో భేటీ కావటం.. పాలేరు అభ్యర్థిత్వంపై చకచకా చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవటం గమనార్హం. పాలేరు ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా మంత్రి తమ్మల నాగేశ్వరరావును ఎంపిక చేస్తూ అధికారిక నిర్ణయం తీసుకోవటం ద్వారా కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాకిచ్చారని చెప్పాలి. తాజా ఉదంతం నేపథ్యంలో కేసీఆర్ అపాయింట్ మెంట్ షాకుల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు కూడా చేరినట్లైంది.