కొత్త భారానికి కేసీఆర్ సర్కారు సై.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువ
ఆరేడు నెలల క్రితమే వ్యవసాయ భూములు.. ఖాళీ స్థలాలు.. అపార్ట్ మెంట్ల ప్లాట్లకు కొత్త మార్కెట్ విలువను ఖరారు చేయటం తెలిసిందే. ఇది సరిపోనట్లు తాజాగా మరోసారి కొత్త రిజిస్ట్రేషన్ విలువను డిసైడ్ చేస్తూ తాజాగా కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు చెందిన పట్టణ.. గ్రామీణ మార్కెట్ విలువల కమిటీలు సమావేశమై.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆమోదముద్ర వేశాయి. దీంతో.. మంగళవారం నుంచి కొత్తగా పెంచిన మార్కెట్ విలువలకు తగ్గట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది.
కొత్త మార్కెట్ రేట్లు అమలుకు ముందు పాత విలువలతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి సోమవారం ఒక్కరోజే అవకాశం ఉంది. దీంతో.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు భారీగా జరగనున్నాయి. ఇక.. కొత్తగా పెంచిన మార్కెట్ విలువల్ని చూస్తే.. వ్యవసాయ భూముల విలువ కనీస పెరుగుదల 50 శాతం.. ఖాళీ స్థలాల పెరుగుదల 35 శాతం.. ప్లాట్ల విలువ 25 శాతం పెరుగుదల ఉందని చెబుతున్నారు.
డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో భారీగా నమోదైన ఈ విలువల పుణ్యమా అని.. సామాన్య.. మధ్యతరగతి వారిపై అదనపు భారం భారీగా పడనుంది. మొన్నటివరకు ఆరు శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ విలువను 7.5 శాతానికి పెంచటం ఒక ఎత్తు అయితే.. తాజాగా మార్కెట్ విలువను పెంచటం ద్వారా.. కొత్తగా రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారికి తడిపి మోపెడు కానుంది.
ప్రాంతాల వారీగా మార్కెట్ విలువలు ఎంతలా పెరిగాయన్నది చూస్తే..
- హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చదరపు గజం రూ.1,14,100గా డిసైడ్ చేశారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక ధర కావటం గమనార్హం. ఇప్పటివరకు ఇది రూ.84,500. అంటే ఒక్కసారిగా గజం విలువ రూ.29,600 పెంచేయటం విశేషం. రెండో స్థానంలో ఓల్డ్ సిటీలోని దివాన్ దేవిడిది. ఈ ప్రాంతంలో చదరపు గజం రూ.78వేల నుంచి రూ.1,05,300కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన టాప్ 5 ప్రాంతాల్ని చూస్తే.. ఇవన్నీ హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాలుగా ఉన్నాయి. అది కూడా హైదరాబాద్ జిల్లా పరిధిలోనివే కావటం గమనార్హం. ఆ ఐదు ప్రాంతాలు ఏవంటే..
1. బంజారాహిల్స్
2. దివాన్ దేవిడి
3. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్
4. కాచిగూడ క్రాస్ రోడ్
5. రెజిమెంట్ బజార్
హైదరాబాద్ తర్వాతి స్థానంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్రాంతాలు ఉన్నాయి. అవేమంటే..
- బేగంపేట
- కుత్భుల్లాపూర్
- కూకట్ పల్లి
- మల్కాజిగిరి
- హబ్సీగూడ
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తర్వాత.. ఎక్కువగా మార్కెట్ విలువ ఉన్న ప్రాంతాలురంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలుగా డిసైడ్ చేశారు. ఈ ప్రాంతాలు హైదరాబాద్ మహానగర పరిధిలోనివే. అవేమంటే..
- గడ్డిఅన్నారం (దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలోనిది)
- మదీనాగూడ
- ఎల్ బీనగర్
- ఖానామెట్
- హయత్ నగర్
హైదరాబాద్.. దాని చుట్టుపక్కల ప్రాంతాలు అత్యధిక మార్కెట్ విలువ ఉన్న ప్రాంతాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత అంత విలువ ఉన్న నగరంగా ఖమ్మం నిలిచింది. ఖమ్మంలో అత్యధికంగా చదరపు గజానికి రూ.52,700గా నిర్ణయిస్తే.. కరీంగనర్ లో రూ.43,900..నిజిమాబాద్..రామగుండంలో రూ.38,900.. రామచంద్రాపురం.. భువనగిరిలో రూ.37,800గా నిర్ణయించారు.
అపార్ట్ మెంట్ల విషయానికి వస్తే చదరపు అడుగు గరిష్ఠ ధర రూ.9500గా నిర్ణయించారు. గతంలో ఇది రూ.7600గా ఉండేది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గరిష్ఠ ధర ఉండగా.. తర్వాతి స్థానాల్లో దివాన్ దేవిడి.. సికింద్రాబాద్.. కూకట్ పల్లి.. తదితర ప్రాంతాలు ఉన్నాయి. గరిష్ఠ ధరల సంగతి ఇలా ఉంటే.. కనిష్ఠ విలువల విషయానికి వస్తే ములుగులో చదరపు గజం రూ.1250గా రెండో అతి తక్కువ ధరగా భూపాలపల్లి జిల్లా మహేదవ్ పూర్ లో రూ.1700గా ఉంది.