తన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ మనువడు

Update: 2020-10-01 14:30 GMT
ఇవాళ ఉదయం నుంచి కేసీఆర్ మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. హిమాన్షుకు కాలు ఫ్యాక్చర్ అయ్యిందని.. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న హిమాన్షును బుధవారం రాత్రి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించినట్టు  వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి.  ఈ వార్తలపై స్వయంగా కేసీఆర్ మనవడు హిమాన్షునే స్పష్టతనిచ్చాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి మనువడు, కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు తీవ్ర గాయమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా అతడే స్పందించాడు. తనకేం కాలేదని కాలికి సాఫ్ట్‌ టిష్యూ డామేజ్‌ అయిందని అన్నారు.

కొందరు గుర్రపుస్వారీ చేస్తూ కిందపడ్డారని పుకార్లు చేస్తున్నారని అలాంటి వార్తలను నమ్మొద్దని హిమాన్షు క్లారిటీ ఇచ్చారు.. రేపటికల్లా నేను పరిగెడుతానని వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని హితవు పలికారు.

నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హిమాన్షు ఇలాంటి వార్తలు రాగానే స్వయంగా  స్పందించడం విశేషం. దీంతో కేటీఆర్ మనువడికి ఏదో జరిగిందన్న ప్రచారానికి తెరపడింది.
Tags:    

Similar News