షెడ్యూల్ పై కేసీఆర్ రియాక్ష‌న్ ఏంది?

Update: 2018-10-07 05:05 GMT
ఎన్నో ఆశ‌లు.. మ‌రెన్నో అంచ‌నాల‌తో.. తిథులు.. న‌క్ష‌త్రాలు.. ముహుర్త బ‌లం చూసుకొని తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేసిన తీరు తెలిసిందే. ముహుర్తాలు.. జాత‌కాల్ని ఎక్కువ‌గా న‌మ్మ‌కంలోకి తీసుకునే కేసీఆర్ అనుకున్న దాని కంటే కాస్త ఆల‌స్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ఈసీ షెడ్యూల్ ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఎన్నిక‌ల షెడ్యూల్ పై ఈసీ ప్ర‌క‌ట‌న‌పై తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్యమంత్రి రియాక్ష‌న్ ఎలా ఉంద‌న్న దానిపై పెద్ద ఎత్తున జ‌ర‌గుతోంది. ఈసీ ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల షెడ్యూల్ చూస్తే.. ఎన్నిక‌ల ఎపిసోడ్‌లో కీల‌క‌మైన పోలింగ్ అమావాస్య రోజున ఉండ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

అన్ని ప‌క్కాగా అనుకొని.. టైమ్లీగా జ‌ర‌గాల‌నుకునే సీఎం కేసీఆర్ అంచ‌నాల‌కు భిన్నంగా కాసింత ఆల‌స్యంగా ఎన్నిక‌లు జ‌ర‌గటంపై కేసీఆర్ రియాక్ష‌న్ ఎలా ఉంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఇదిలా ఉంటే.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈసీ మీడియా స‌మావేశాన్ని కేసీఆర్ చూశార‌ని.. ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. డిసెంబ‌రులో ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని.. సానుకూల ప‌రిణామంగా ఆయ‌న చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

మొత్తం 119 అసెంబ్లీ స్థానాల‌కు ఇప్ప‌టికే 105 స్థానాల్లో అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. మిగిలిన 14 సీట్ల‌కు అభ్య‌ర్థుల్ని ఈ అమావాస్య త‌ర్వాత ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ నెల 9 త‌ర్వాత ఏ క్ష‌ణంలో అయినా కేసీఆర్ త‌న తుది జాబితాను ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు.

ఈసీ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న అనంత‌రం కేసీఆర్ హ్యాపీగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. మిగిలిన వారు అనుకున్న‌ట్లుగా అమావాస్య రోజున పోలింగ్ విష‌యాన్ని కేసీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వాత జిల్లా పార్టీ నేత‌ల‌తో మాట్లాడి..ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మ‌రింత ముమ్మ‌రం చేయాల‌న్న ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా ఈసీ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.


Tags:    

Similar News