గులాబీ దళపతి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫ్యాన్స్ గ్రాఫ్ పెరిగిపోతోందనేందుకు తాజా నిదర్శనం ఇది. గతంలో ఆంధ్రాకు వెళ్లిన కేసీఆర్ కు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు ఆంధ్రాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఈరోజు మరోసారి నిరూపణ అయింది. కేసీఆర్ ఆదివారం విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు - బ్యానర్లు - తోరణాలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వెళ్లే రోడ్ మార్గం వరకు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయడంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు ప్రత్యేకంగా ఆగి చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు స్వాగతం.. సుస్వాగతం అంటూ సాదరంగా ఆహ్వానించే తోరణాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని నేడు సందర్శించనున్న నేపథ్యంలో పీఠంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటారు.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ - బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ ఎస్ అధినేత - ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. కేసీఆర్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరారు. సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదాపీఠం చేరుకుంటారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. సాయంత్రం 4.30గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్ కు వెళ్తారు.