దసరా ముందర ప్రజలకు సీఎం కేసీఆర్ వరం ప్రకటించారు. ఇటీవల భారీ వర్షాలకు మునిగిపోయిన వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థికసాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం లక్షమందికి ఆర్థికసాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ నగరంలో వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై ప్రగతి భవన్ లో కేసీఆర్ సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లల్లోకి నీళ్లు చేరి ఆహారం, దుస్తులు, చద్దర్లు అన్ని తడిసిపోయాయని.. వండుకొని తినేందుకు సరుకులు కూడా లేని కుటుంబాలు ఉన్నాయని.. వారందరికీ తక్షణ సాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్ ఆదేశించారు.
ఇక భారీ వర్షాలకు, వరదలకు 15 సబ్ స్టేషన్లు దెబ్బతినగా పునరుద్దరించామని.. గ్రామీణ ప్రాంతానికి వ్యవసాయ రంగానికి ఇబ్బందులు కలుగకుండా వెంటనే ట్రాన్స్ ఫార్మర్లు రిపేర్లు చేశామని కేసీఆర్ తెలిపారు.
మూసీ నది వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను మరమ్మతు చేశామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయానికి, ఇంటికి విద్యుత్ ను పునరుద్దరించినట్లు కేసీఆర్ తెలిపారు.