తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఎంత విలక్షణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తనను తాను సో స్పెషల్ గా ఫీల్ కావటమే కాదు.. అదే తీరులో ఆయన వ్యవహారశైలి ఉంటుందని ఆయన్ను నిశితంగా పరిశీలించే వారు తరచూ చెబుతుంటారు. ఇష్యూ ఏదైనా తనదే పైచేయిగా ఉండాలన్న భావన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందని చెబుతారు. ఇందుకు తగ్గట్లే ఆయన గురించి పలు ఉదాహరణలు ప్రస్తావిస్తుంటారు. రోహిత్ ఎపిసోడ్ సమయంలో.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫోన్ చేసినప్పుడు.. కేసీఆర్ కనీసం ఫోన్ రిసీవ్ చేసుకోకపోవటమే కాదు.. ఆయన చాలా బిజీగా ఉన్నారంటూ వచ్చిన సమాధానం విని.. అవాక్కు కావటంకేంద్రమంత్ర వంతైంది.
ఇదే విషయాన్ని ఆమె పార్లమెంటులో కూడా చెప్పుకొచ్చారు. అలాంటి కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లే ఇచ్చి.. చివర్లో నో చెప్పేసిన ప్రధాని మోడీ తీరుతో కేసీఆర్ హర్ట్ అయినట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోడీతో భేటీ తర్వాత కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కుమారుడి పెళ్లికి హాజరు కావాలనుకున్నప్పటికీ.. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని నేపథ్యంలో ఢిల్లీకి అసలే వెళ్లకూడదని అనుకున్నట్లు చెబుతున్నారు.
అయితే.. కేంద్రమంత్రి జవదేకర్.. ఆదివారం ఉదయం ఫోన్ చేసి పెళ్లికి రావాలని స్వయంగా కోరటంతో.. ఆయన ఢిల్లీకి బయలుదేరారు. తాజా ఢిల్లీ పర్యటనలో పెళ్లికి వెళ్లనున్న కేసీఆర్.. రాష్ట్రపతి ప్రణబ్ తో సహా పలువురు ప్రముఖుల్ని కలిసే వీలుందని చెబుతున్నారు. ఇంతమందితో భేటీ అయిన ప్రధాని మోడీని మాత్రం కలిసే అవకాశమే లేదని చెబుతున్నారు. అయితే.. జవదేకర్ కుమారుడి పెళ్లికి మోడీ కూడా రానున్న నేపథ్యంలో.. ఇరువురు ఎదురుపడతారా? ఒకవేళ అదే జరిగితే..మోడీ ఎలా వ్యవహరిస్తారు? దీనికి కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరు కానుండటం.. ఇద్దరి చంద్రుళ్లతో మోడీ వ్యవహరించే తీరుపై అందరూ ఒక లుక్కేసే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/