తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత మరోసారి రాజకీయం వేడెక్కింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలవడంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో తాడో పేడో అన్నట్లుగా కేసీఆర్ తేల్చుకోబోతున్నాడు. ఇందులో భాగంగా వరిధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఈ శుక్రవారం నుంచి ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బీజేపీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ నిర్వహించే సమావేశాలకు, కార్యక్రమాలకు పరోక్షంగా మద్దతు ఇచ్చే కేసీఆర్ ఇప్పుడు ఆయన నేరుగా ఆ పార్టీతో దూరంగా ఉండేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో త్వరలో జరిగే ‘ఎస్ జడ్ సీ’ సమావేశాలకు వెళ్లేది లేదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దక్షిణాదిన నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నాయకులతో ఈనెల 14న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, సమస్యల పరిష్కారంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు ‘సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్’(ఎస్ జడ్ సీ) సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జోన్ల వారీగా ఏటా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలతో పాటు పుదుచ్చేరి, అండమాన్, లక్ష్యద్వీప్ ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ సమావేశాలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈసారి ఏపీలోని తిరుపతి వేదికగా ఈనెల 14న ఆదివారం నిర్వహించనున్నారు.
అయితే ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. మొన్నటి వరకు ఈ సమావేశాలకు కేసీఆర్ నేరుగా వెళ్తాడని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్రంపై యుద్ధభేరి మోగించిన కేసీఆర్ ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. మరి కొన్ని అంశాలపై కేంద్రంపై గుర్రుగా ఉన్న ఆయన సమావేశాలకు వెళ్లకుండా ఉండడమే బెటరని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బదులుగా హోంమత్రి మహమ్మూద్ అలీని పంపించే అవకాశాలున్నాయని అంటున్నారు.
తెలంగాణకు సంబంధించిన సాగునీటి అంశాలు, విభజన చట్టం హామీలు, తదతర సమస్యలు ఆయన కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతున్న ఈ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడానికి రాజకీయ అంశాలే ప్రధాన కారణమని అంటున్నారు. కాగా ఇలాంటి సమావేశాలకు కేసీఆర్ నేరుగా హాజరు కారని, హోంమత్రినో.. ప్రధాన కార్యదర్శినో పంపేవారని అంటున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తిరుపతిలో నిర్వహించే ఎస్ జడ్ సీ సమావేశానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. దీంతో ఈసారి సమావేశాలు విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సీఎం ఉపాధ్యక్షుడిగా జరుగుతున్న ఈ సమావేశానిక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ సీఎం విజయ్ పినరయి, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మే, పుదుచ్చేరి, అండమాన్, లక్ష్యద్వీప్ ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు హాజరు కాబోతున్నారు. తెలంగాణ నుంచి హోం మంత్రి మహ్మద్ అలీ హాజరు కాబోతున్నారు. అయితే అధికారికంగా మాత్ర వెలువడలేదు.