ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. గెలుపోటములపై ఓటర్ల తీర్పు ఫైనల్ అయ్యింది. ఐదేళ్ల అధికారం కేసీఆర్‌కు దఖల పరుస్తూ తెలంగాణ ప్రజలు తమ నిర్ణయాన్ని చెప్పేశారు. అన్ని జరిగిపోయి పదిహేను రోజులు గడిచిన తర్వాత.. నేటికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయని పరిస్థితి ఎందుకు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దేశంలో మరెక్కడా లేని రీతిలో ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయని పరిస్థితి ఎందుకు? అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఏపీ.. ఒడిశా.. పశ్చిమబెంగాల్‌లో పర్యటించి.. ఢిల్లీలో కేసీఆర్ ఉండిపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
ఎన్నికల కారణంగా గడిచిన నాలుగైదు నెలలుగా తెలంగాణలో పాలన పడేసిందని.. పవర్లోకి వచ్చిన కేసీఆర్ పాలన మీద దృష్టి పెట్టకుండా ఫ్రంట్ పేరుతో జర్నీ చేయటాన్ని కాంగ్రెస్ నేతలు పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువు తీరటం.. ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయటం లాంటివి జరిగిపోతే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్న విమర్శలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్.. కేటీఆర్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పలు రాష్ట్రాల్లో తిరుగుతూ.. ఢిల్లీలో ఉండిపోయారని తప్పు పట్టారు. అదే సమయంలో కేటీఆర్ దుబాయ్ ట్రిప్పుల్లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలో పాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ట్రిప్పుల్లో బిజీగా ఉండటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
సీఎం కేసీఆర్ గుళ్లు.. గోపురాలు.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంటే.. ఆయన కొడుకు కమ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ దుబాయ్ టూర్ లో ఉండటం ఏమిటంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ మాటకు వస్తే.. సంపత్ తో పాటు.. విజయశాంతి.. పలువురు కాంగ్రెస్ నేతలు తండ్రీ కొడుకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.