తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఎంత విలక్షణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అసలు పట్టనట్లుగా ఉండటం.. నెలల తరబడి విషయాల్ని తేల్చకుండా పెండింగ్ లో పెట్టేసే ఆయన.. మరికొన్నిసార్లు మాత్రం అందుకు భిన్నంగా పూనకం వచ్చినట్లుగా వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇటీవల వెల్లడైన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో.. ఆయన మౌనంగా ఉండటం తెలిసిందే. అయితే.. ఈ ఓటమి నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాలన్న భావనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారట.
అందరి అంచనాలకు భిన్నంగా పదవుల పందేరానికి తెర తీసినట్లుగా చెబుతున్నారు. గడిచిన కొంతకాలంగా ఫైనల్ చేయని పదవులకు తాజాగా ఎంపిక పూర్తి చేయటంతో పాటు.. ఖాళీగా ఉన్న నామినేట్ పోస్టులతో పాటు మరికొన్నింటి విషయంలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పలువురు నేతలకు దక్కనున్న పదవుల జాబితాను చూస్తే..
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత.. అసెంబ్లీ మాజీ స్పీకర్ గా వ్యవహరించిన స్పీకర్ మధుసూదనాచారికి మండలి ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం మధుసూదనాచారికి తెలియజేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధుసూదనాచారిని ఎంపిక చేసి.. అనంతరం ఛైర్మన్ పదవిని కట్టబెడతారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తం ఆరు స్థానాల ఖాళీ భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడనుంది. అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం కారణంగా.. ఈ మొత్తం ఆరు స్థానాలు గులాబీ ఖాతాలోకే చేరనున్నాయి. ప్రస్తుతం మండలి ఛైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి జూన్ లో విరమణ చేశారు. అప్పటి నుంచి భూపాల్ రెడ్డి ప్రొటెం ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో మధుసూదనాచారికి పదవి దక్కనుంది.
మరి.. గుత్తా మాటేమిటంటే.. ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసి.. అనంతరం మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవి ఇస్తానన్న కేసీఆర్ మాటతోనే పార్టీలోకి చేరారని చెబుతారు. అయితే.. అప్పట్లో కుదరని నేపథ్యంలో తాజాగా మంత్రి పదవి ఇవ్వటం ద్వారా పాత హామీని పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఈటల స్థానాన్ని గుత్తాతో భర్తీ చేస్తారని చెబుతున్నారు.
మొత్తం ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా.. ఒకటి గుత్తాకు.. మరొకటి మధుసూదనాచారికి ఇవ్వగా.. మిగిలిన నాలుగు స్థానాల్లో ఒకదాన్ని పాడి కౌశిక్ రెడ్డికి.. మరొకటి సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్ రావుకు ఇస్తారని చెబుతున్నారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని మండలికి పంపాలని భావించినా.. అది సాధ్యం కాకపోవటంతో ఎమ్మెల్యే కోటాలో ఆయన్ను ఎంపిక చేయనున్నారు.
విద్యార్థి నేతగా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే.. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇస్తే మాత్రం.. ఎర్రోళ్ల పేరును స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయొచ్చంటున్నారు. మరో ఎమ్మెల్సీ స్థానానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ పార్టీకి కీలకంగా వ్యవహరించిన పార్టీ నేత కోటిరెడ్డికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఒకవేళ.. ఈ కాంబినేషన్లో ఏమైనా తేడా వస్తే.. టీడీపీ నుంచి వచ్చిన సీనియర్ నేత ఎల్ రమణకు లేదంటే కర్నాటి విద్యాసాగర్ కు అవకాశం దక్కే వీలుందంటున్నారు. ఇవి కాక మరికొన్ని పేర్లు వినిపిస్తున్నా.. అవకాశాలు మాత్రం ఎక్కువగా వీరికే ఉందంటున్నారు.