జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్న కాంగ్రెస్ నేత!

Update: 2019-07-06 14:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి  నేర్చుకోవాల్సినది చాలా ఉందని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. ముఖ్యమంత్రిగా ఎలా వ్యవహరించాలనే అంశంలో జగన్ ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని షబ్బీర్ అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రజల సమస్యలను వినడానికి 'ప్రజాదర్బార్' ను పెట్టబోతున్నారన్న విషయాన్ని షబ్బీర్ అలీ ప్రస్తావించారు.

పక్క రాష్ట్రంలో జగన్ ప్రజాదర్బార్ పెట్టి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే.. కేసీఆర్ కు మాత్రం ప్రజల సమస్యలను వినే ఓపిక లేకుండా పోయిందని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు.

తెలంగాణలో అన్ని వర్గాలూ అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రైతులు, కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు కేసీఆర్ పాలనపై విరక్తితో ఉన్నారన్నారు. ఐదేళ్ల కిందట రుణమాఫీని చెప్పి ఇప్పటికీ కేసీఆర్ చేయలేదన్నారు.  

ఉమ్మడి రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండగా, విభజన తర్వాత తెలంగాణ బడ్జెట్ ను లోటు బడ్జెట్ గా మార్చారంటూ కేసీఆర్ మీద ధ్వజమెత్తారు షబ్బీర్ అలీ.
Tags:    

Similar News