బాల్య మిత్రుడి ఇంటికి భోజ‌నానికి వెళ్లిన సీఎం

Update: 2018-07-09 04:48 GMT
అనూహ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు భిన్నంగా ఉంటుంది. తోపుల్లాంటి పెద్ద‌మ‌నుషులు రాష్ట్రానికి వ‌చ్చిన‌ప్పుడు.. వారి గౌర‌వార్ధం ఏర్పాటు చేసే విందుల‌కు సైతం వెళ్ల‌కుండా ఉండ‌గ‌లిగే స‌త్తా సీఎం కేసీఆర్‌ కు మాత్ర‌మేన‌ని చెప్పాలి.

ప్ర‌ముఖుల్ని క‌లుసుకునే విష‌యంలోనూ.. వారు పాల్గొనే స‌భ‌లు.. స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే విష‌యంలోనూ పెద్ద‌గా ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌ని అధినేత‌గా కేసీఆర్‌ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అయితే.. దీనికి భిన్నంగా సామాన్యుల ద‌గ్గ‌ర‌కు.. త‌న బాల్య మిత్రుల‌కు పెద్ద‌పీట వేసే సీఎం.. కొన్నిసంద‌ర్భాల్లో వారే త‌న ఇంటికి పిలిపించుకొని విందు ఇవ్వ‌టం.. అప్పుడ‌ప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ.. త‌న చిన్న‌నాటి స్నేహితులు.. త‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే వారి ఇంటికి వెళ్ల‌టం కేసీఆర్‌ కు మామూలే.

తాజాగా త‌న చిన్న‌నాటి మిత్రుడు జ‌హంగీర్ ఇంట్లో భోజ‌నానికి వెళ్లారు సీఎం కేసీఆర్. సిద్ధిపేట జిల్లా ములుగు మండ‌లానికి చెందిన టీఆర్ఎస్ నేత అంజిరెడ్డి త‌ల్లి వ‌ర్థంతి స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఆ కార్య‌క్ర‌మం నుంచి తిరిగి వ‌స్తూ త‌న స్నేహితుడి ఇంటికి విందుకు వెళ్లారు.

కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో మొద‌ట్నించి ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తిగా  అంజిరెడ్డికి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. అంతేకాదు.. త‌న బాల్య మిత్రుడు జహంగీర్ కు ప్ర‌ధాన అనుచ‌రుడిగా అంజిరెడ్డికి ప్ర‌త్యేక అనుబంధం ఉంది. ఆ విష‌యాన్ని తెలియ‌జేసేలా.. వారింట్లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కేసీఆర్‌.. అంజితో త‌న‌కున్నఅనుబంధాన్ని చెప్ప‌కనే చెప్పేశార‌ని చెప్పాలి. అంతేకాదు.. త‌న బాల్య‌మిత్రుడు జ‌హంగిర్ తో విందుకు వెళ్ల‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

Tags:    

Similar News