గ‌వ‌ర్న‌ర్‌ తో కేసీఆర్ : విష‌యం ఏంటో?

Update: 2015-10-25 09:06 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో మ‌రోమారు స‌మావేశం అయ్యారు. దాదాపు అరగంట పాటు వీరి స‌మావేశం జ‌రిగింది. తెలంగాణలో ప్రభుత్వం చెపడుతున్న అభివృద్ధి పనులు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని వార్త‌లు వెలువడుతున్న‌ప్ప‌టికీ అస‌లు విష‌యం వేరే ఉంద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌లి కాలంలో త‌ర‌చుగా గ‌వ‌ర్న‌ర్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ క‌లుస్తున్నారు. అయితే  తాజా భేటీ వెన‌క మ‌ర్మం ఏమిట‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చిస్తున్నాయి. తెలంగాణ‌లో త్వ‌ర‌లో నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు ప్ర‌క్రియ గురించి గ‌వ‌ర్న‌ర్‌ కు స‌మాచారం ఇచ్చేందుకు వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో పాటు త్వ‌ర‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానున్న నేప‌థ్యంలో స‌ద‌రు ప్ర‌క్రియ గురించి రాజ్యాంగ‌ పెద్ద అయిన గ‌వ‌ర్న‌ర్‌ కు వివ‌రాలు చెప్పేందుకు భేటీ అయ్యార‌ని తెలుస్తోంది. వీట‌న్నింటితోపాటు నారాయ‌ణ్ ఖేడ్ ఉప ఎన్నిక గురించి కూడా గ‌వ‌ర్న‌ర్‌ తో జ‌రిగిన స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News