కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిశితంగా గమనిస్తే ఒక అంశం అర్థమవుతుంది. అవసరం ఉన్నా.. లేకున్నా తరచూ గవర్నర్ నరసింహన్ తో భేటీ కావటం కనిపిస్తుంది. విడిరోజుల్లోనే కాదు.. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు తాను చేయబోయే పని గురించి వివరంగా గవర్నర్ కు చెప్పి.. ఆయన పీడ్ బ్యాక్ ను ఆసక్తిగా వింటారని చెబుతారు. కొత్త జిల్లాల మీద గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న కసరత్తు తెలిసిందే.
తాజాగా దీనికి సంబంధించిన నిర్ణయం తీసేసుకొని.. సాంకేతికంగా పూర్తి చేయాల్సిన అంశం మీద కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ కావటం గమనార్హం. ఈ రోజు రాత్రికి కొత్త జిల్లాల మీద ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ నివేదికను సీనియర్ నేత కేకే అందజేయనున్నారు. ఇది చేతికి వచ్చింది మొదలు.. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన మలిదశ మొదలైనట్లేనని చెప్పాలి.
కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల్ని గవర్నర్ కు వివరించటంతో పాటు.. ఆయన స్పందన తెలుసుకోవటం.. సలహాలు.. సూచనలు కోరటం కోసమే గవర్నర్ ను కలిసినట్లుగా చెబుతున్నారు. కొత్త జిల్లాల పెంపునకు సంబంధించిన అంశాలతో పాటు.. పాలనా పరమైన అంశాలను కూడా గవర్నర్ కు వివరించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాల అంశంతో పాటు.. సద్దుల బతుకమ్మ వేడుకులకు రావాల్సిందిగా గవర్నర్ ను కేసీఆర్ ఆహ్వానించారు. కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి కసరత్తు బాగుందని ఆయన ప్రశంసించినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక.. ముఖ్యమంత్రే స్వయంగా ఆహ్వానించిన తర్వాత.. గవర్నర్ సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉంటారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/