వైసీపీ టాక్‌: కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న నిజం.. అది అబ‌ద్ధం.. !

వైసీపీలో కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న నిజం. కానీ, వారంతా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌న్న‌ది మాత్రం అబ‌ద్ధ‌మ‌ని అంటున్నారు ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు.

Update: 2024-12-24 05:30 GMT

వైసీపీలో కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న నిజం. కానీ, వారంతా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌న్న‌ది మాత్రం అబ‌ద్ధ‌మ‌ని అంటున్నారు ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు. గ‌త కొన్ని రోజులుగా వైసీపీలో క‌ల‌క‌లం రేగుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల నిర్వ‌హించిన రైతు నిర‌స‌న కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌ల‌ను పోగేయాల‌ని.. ధూంధాంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు. నిర్వ‌హించారు కూడా. అయితే.. మైలేజీ రాలేదు.

నిజానికి నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను జోరుగా నిర్వ‌హించి.. పార్టీకి పున‌ర్ వైభ‌వం తీసుకురావాల‌ని.. వైసీపీ అదినేత జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ ర్గాల వారీగా ఆయ‌న స‌మీక్ష‌లు నిర్వ‌హించి.. పార్టీ నేత‌ల‌ను రంగంలోకి దింపారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఈ నెల 27న విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధుల‌పై పోరాటాలు చేయాల‌న్న‌ది ఈ షెడ్యూల్‌లో భాగమే. అయితే.. ఇప్ప‌టికే నిర్వ‌హించిన రైతు నిర‌స‌న కార్య‌క్ర‌మం ఫ్లాప్ అయింది.

దీంతో పార్టీ కేడ‌ర్ జ‌గ‌న్ నాయ‌క‌త్వానికి భిన్నంగా ఉంద‌ని.. అంద‌కే ఈ కార్య‌క్ర‌మం విఫ‌ల‌మైంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. పైగా.. జ‌గ‌న్ ను వారు విమ‌ర్శిస్తున్నార‌న్న క‌థ‌నాలు కూడా.. ఓ వ‌ర్గం మీడియాలో వ‌స్తు న్నాయి. దీంతో సీనియ‌ర్లు కొంద‌రుమీడియా ముందుకు వ‌చ్చి.. అలాంటిదేమీ లేద‌న్నారు. కానీ, పార్టీ కార్య క‌ర్త‌ల్లో మాత్రం.. నిరాస‌, అసంతృప్తి ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. ఏ పార్టీకైనా ఓట‌మి ఎదురైన‌ప్పు డు ఉండే ప‌రిణామాలే త‌మ‌కు కూడా ఎదుర‌వుతున్నాయ‌ని చెబుతున్నారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌ట్టించుకోలేద‌న్న వాద‌న‌ను వారు కూడా అంగీక‌రిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని.. పార్టీ ని ముందు బ‌లోపేతం చేయ‌డంపైనే తాము దృష్టి పెడుతున్నామ‌ని అనంత‌పురం జిల్లాకు చెందిన వెంక‌ట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఇన్ని స‌మ‌స్య‌ల‌కు కూడా.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తే.. ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని.. ఈసారి కార్య‌క‌ర్త‌ల‌కు వెన్నుద‌న్నుగా ఉండేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే ఆలోచ‌న ఉంద‌ని కూడా.. ఆయ‌న‌ చెప్పుకొచ్చారు. అయితే.. ఏ విధంగా కార్య‌క‌ర్త‌ల‌ను ఆదుకుంటార‌నే విష‌యం చూడాలి.ఏదేమైనా.. నిప్పులేందే పొగ‌రాదు.. కానీ, నిప్పు లేద‌ని చెబుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌ర‌గుతుందో..!

Tags:    

Similar News