ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటమి కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన గులాబీ బాస్ కేసీఆర్ కు ఊహించినరీతిలో షాక్ తగిలింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఓటమిని ఎటకారం చేసుకునే అద్భుత ఛాన్స్ వచ్చిందని భావించిన గులాబీ బాస్ తో సహా నేతలంతా ఇప్పుడు ఢీలా అయ్యే పరిస్థితి. ఇప్పుడే కాదు.. మరెప్పటికీ అవకాశం లేనట్లుగా పరిస్థితి తాజా ఎన్నికల ఫలితంతో ఎదురైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల వేళ.. తనను కెలికేందుకు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిన బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎటకారమాడిన కేసీఆర్.. అదే సందర్భంలో తనకు తెలంగాణ ప్రజలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ గురించి అంచనా వేయటంలో తప్పులో కాలేసినట్లుగా చెప్పక తప్పదు. ఇప్పుడీ విషయాన్ని గులాబీ నేతలు పలువురు లోగుట్టుగా మాట్లాడుకుంటున్నారు.
నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన పార్టీ.. ఈ రోజు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎంతసేపటికి బాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ గురించి ఆలోచించిన గులాబీ బాస్.. తనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించటంలో విఫలం చెందటం ఒక ఎత్తు అయితే.. పసుపురైతుల విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన నిర్లక్ష్యం భారీ మూల్యాన్నిచెల్లించక తప్పలేదంటున్నారు. కేసీఆర్ లాంటి తిరుగులేని అధినేత కుమార్తె ఘోరంగా ఓడిపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజా ఓటమితో బాబుకు రిటర్న్ గిఫ్ట్ తో పాటు.. ఆయన కుమారుడు లోకేశ్ ఓటమిని ఎటకారం చేసుకునే అద్భుత అవకాశం మిస్ అయినందుకు గులాబీ అధినేతతో పాటు.. పలువురు నేతలు వాపోతున్నట్లుగా తెలుస్తోంది.