జాతీయ పార్టీ అని ఉవ్విళ్ళూరుతున్న కేసీయార్ తొందరలో ఆ పని కానిచ్చేసేటట్టున్నారు. ఆయన మంచి ముహూర్తం చూసుకుని భారత రాష్ట్ర సమితి పేరిత పార్టీని ప్రారంభిస్తారు అని అంటున్నారు. జాతీయ రాజకీయాలు అంటే దేశంలో 28 రాష్త్ట్రాలు ఉన్నాయి. అంతటా జాతీయ పార్టీ జెండా ఎగరకున్నా సాటి తెలుగు రాష్ట్రంలో అయినా ఎగరాలి కదా. ఉమ్మడి ఏపీగా అరవై ఏళ్ళు కలసి ఉన్న ఆంధ్రాలో కేసీయార్ కొత్త పార్టీ హడావుడి ఉండాలి కదా.
ఏపీలో సీన్ చూస్తే కేసీయార్ పెట్టబోయే పార్టీకి అనుకూలత పెద్దగా లేదు అనిపిస్తోంది అంటున్నారు. అక్కడ అంతా కాషాయ స్నేహమే పరిమళిస్తోంది. అధికార వైసీపీ ఢిల్లీలో బీజేపీతో బాగానే దోస్తీ చేస్తోంది. ఇక టీడీపీ దాని అధినాయకుడు చంద్రబాబు అయితే మూడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీలో మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి ఫుల్ హుషార్ అయ్యారు. ఎన్నికల నాటికి పొత్తు కుదరకతప్పదని ఆయన ఆశాభావంతో ఉన్నారు.
ఆదికి ముందే బీజేపీతో జతకట్టిన జనసేన పవన్ కళ్యాణ్ మరో వైపు ఉన్నారు. ఏపీలో ప్రధాన పార్టీల సీన్ ఇలా ఉంది. మరి కేసీయార్ కి కొత్త మిత్రులు ఎక్కడ దొరుకుతారు అన్నది అతి పెద్ద చర్చగానే ఉంది. ఏపీలో బీజేపీకి ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేరు. అయితేనేమి అక్కడ గెలిచిన పార్టీలన్నీ బీజేపీకి జై కొడతాయి. ఇంతలా కులాసాగా ఉండే రాష్ట్రం దేశంలోనే బీజేపీకి లేదు.
అలాంటి ఏపీలో బీజేపీకి బీపీ తెప్పించేందుకు కేసీయార్ ఏం చేయబోతున్నారు అన్నదే ఇక్కడ చర్చ. కేసీయార్ కి తన చిరకాల మిత్రుడు జగన్ ఉన్నారు. కానీ ఆయన అర్జంటుగా బీజేపీ నుంచి బయటకు వచ్చి మద్దతు ఇవ్వరు అని అంటారు. ఇక ఒకనాటి గురువు, ఈనాటి ప్రత్యర్ధి అయిన చంద్రబాబుతో కేసీయార్ పొత్తు కుదిరే ముచ్చట కాదు. మరి పవన్ కళ్యాణ్ అయినా దోస్తీ చేస్తారా అంటే ఆయన టీడీపీతోనూ బీజేపీతోనూ ఉండేందుకే ఇష్టపడతారు.
మరి కేసీయార్ ఏం చేయాలి, ఏం చేస్తే ఆయనకు ఏపీలో కాలూనేందుకు ప్లేస్ దొరుకుతుంది అంటే ప్రస్తుతానికైతే ప్రధాన పార్టీలేవీ ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా లేవు. తెలంగాణాలో ఎటూ వామపక్షాలతో కేసీయార్ దోస్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వారే జత కట్టవచ్చు. అలాగే కాంగ్రెస్ ఎటూ కాకుండా ఉంది. ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఏమీ పెద్దగా లేదు కానీ కేసీయార్ తో కలసి పోటీకి ఉత్సాహాం చూపించవచ్చు. ఇలా ఈ పార్టీలను ముందు పెట్టుకునే ఏపీలో కేసీయార్ రాజకీయం చేయాలి. బీజేపీ ని ఏపీలో కొట్టాలంటే కేసీయార్ కి వేరే దారేదీ కనిపించడంలేదు అని అంటున్నారు.
అయితే 2024 తరువాత కేంద్రంలో బీజేపీ రాజకీయ బలం తగ్గి సంకీరణానికి దారులు దొరికితే మాత్రం అపుడు ఏపీలో కేసీయార్ వైపు ఎవరైనా చూడవచ్చు. కానీ అప్పటికి ఎన్నికల కార్యం పూర్తి అయిపోతుంది. సో గులాబీ బాస్ కి ఏపీలో ఆశలు పెద్దగా లేవనే ఇప్పటికి ఉన్న విశ్లేషణ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.