ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏపీలో 5, తెలంగాణకు 5 సీట్లు ఉన్నాయి. ఏపీలో ఉన్న 5 సీట్లలో నాలుగు టీడీపీకి, ఒకటి వైసీపీకి వస్తాయి. వైసీపీ తరపు నుంచి జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఎవ్వరూ పోటీ లేకపోవడంతో.. ఆయన ఎంపిక దాదాపు కన్ ఫర్మ్ అయినట్లే. ఇక టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. వీళ్లకు కూడా ఎవ్వరూ పోటీ లేకపోవడంతో వీరి ఎన్నిక కూడా దాదాపు లాంఛనమే. కానీ తెలంగాణకు వచ్చేసరికి పోటీ తప్పేట్లు లేదు.
లెక్కప్రకారం.. ఉన్న 5 సీట్లలో.. ఎమ్మెల్యే సంఖ్య ప్రకారం టీఆర్ ఎస్ కు 4 సీట్లు వస్తాయి. ఇక మిగిలిన ఒక్క సీటు కాంగ్రెస్ కు వస్తుంది. లేదా కాంగ్రెస్ కు వాళ్లు ఎవరికి మద్దతిస్తే వారికి చెందుతుంది. అయితే.. ఇక్కడే తెలంగాణ సీఎం కేసీఆర్ అస్సలు తగ్గడం లేదు. మండలిలో కాంగ్రెస్ సభ్యుల్ని చూసేందుకు ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అందుకే.. ఐదో అభ్యర్థి అవకాశాన్ని ఎంఐఎంకి ఇచ్చారు. వారికున్న ఎమ్మెల్యేల బలం ఉపయోగించుకున్నా కూడా ఐదో అభ్యర్థిని గెలవడం టీఆర్ ఎస్ కు కష్టమే. అందుకే.. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందర్ని తమ పార్టీలోకి లాగేందుకు, లేదా.. వారికి కొనేందుకు కూడా వెనకాడడం లేదని సమాచారం. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాను గెలవడం పక్కా అని ఆయన అంటున్నారు. టీఆర్ ఎస్ మాత్రం ఎలాగైనా 5వ ఎమ్మెల్సీ సీటుని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది. మరి టీఆర్ ఎస్ మంత్రాగం ఫలిస్తుందో లేదో తెలియాలంటే.. మార్చి 12న జరిగే ఎన్నిక వరకు ఆగాల్సిందే.