తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి అని చెబుతారు. కానీ.. ఆయనకు మించిన జగమొండి ప్రధాని నరేంద్ర మోడీగా చెప్పొచ్చు. ఏదైనా విషయంలో ఆయన కానీ ఒక్కసారి ఫిక్స్ అయితే.. మోడీ మనసు మార్చటం అంత తేలికైన విషయం కాదని చెబుతుంటారు. నచ్చని వారిని కలిసేందుకు సైతం ఇష్టపడని తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో తనపై తీవ్రవ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మోడీ చాలానే అగ్రహంతో ఉన్నట్లు చెబుతారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత.. కేసీఆర్ తన స్నేహ హస్తాన్ని చాచినప్పటికీ మోడీ పెద్దగా రియాక్ట్ కాలేదని చెబుతారు.
దీనికి తోడు ఓటుకు నోటు వ్యవహారం.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలపైనా.. కేసీఆర్ అనుసరించిన వైఖరి మోడీని మరింత ప్రభావితం చేసిందని చెబుతారు. ఒకదశలో ప్రధాని మోడీని కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలానే ప్రయత్నించినా ఫలించలేదని చెబుతారు. రాజకీయ నేతలు మొదలు కొని సెలబ్రిటీల వరకూ.. అంతా తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మోడీని పిలిచే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. ఇలా అందరితోనూ కలిసే మోడీ.. కేసీఆర్ విషయానికి వస్తే మాత్రం బిగదీసుకున్నట్లుగా వ్యవహరించటం ఆసక్తికరం.
తాజాగా అయుత చండీయాగం వ్యవహారమే తీసుకుంటే.. తాను వ్యక్తిగత హోదాలో భారీగా నిర్వహిస్తున్న ఈ యాగానికి ప్రధాని మోడీని కలిసి.. వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు కేసీఆర్ ఎంతగానో ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చివరకు ఆయన తన ఇన్విటేషన్ కార్డును మోడీకి పంపగలిగారు. తాజాగా చండీయాగం ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ప్రధాని తన పట్ల వ్యవహరించిన తీరును పరోక్షంగా ప్రస్తావించటం గమనార్హం.
చండీయాగానికి సంబంధించి హాజరయ్యే ప్రముఖులకు సంబంధించిన వివరాల్ని కేసీఆర్ ప్రకటించగా.. అందులో రాష్ట్రపతి.. వివిధ రాష్ట్రాల గవర్నర్లు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేల.. సాధారణ ప్రజానీకం ఉంది. ఇంతమంది ఉన్నప్పటికీ ప్రధాని మోడీ హాజరు గురించి మాత్రం కేసీఆర్ స్పష్టంగా చెప్పలేదు. మోడీకి నెల క్రితమే తాను అయుత చండీయాగానికి ఇన్విటేషన్ అందించామని.. ఇప్పటివరకూ మోడీ వస్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పటం గమనార్హం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న ఒక భారీ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాన్ని నెల క్రితమే ఇచ్చినా.. ఇప్పటికి ఈ అంశంపై మోడీ రియాక్ట్ కాకపోవటం కాస్త ఆశ్చర్యకరంగా అనిపించట్లేదు..?