ఒక్క మాట అంటే చాలు.. గులాబీ దళం విరుచుకుపడుతుంది. రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శల్ని బలంగా తిప్పి కొట్టేందుకు ఎలాంటి భాషనైనా వాడటం వారికి అలవాటే. అలాంటిది పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పెద్ద సారును పట్టుకొని ఫైర్ కావటం.. సర్కారును బద్నాం చేయటం లాంటివి చేస్తే గులాబీ దళం ఎంతలా చెలరేగిపోవాలి?
కానీ.. అందుకు భిన్నంగా ఎవరూ ఏమీ మాట్లాడని పరిస్థితి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో ను ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మిత్రుడు కమ్ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ చేసిన విమర్శల గురించి.. ఆగ్రహంతో ఆయన చేసిన ప్రకటన గురించి పల్లెత్తు మాట అనలేదు. మెట్రోను ప్రారంభించటానికి కాస్త ముందుగా ఆయన ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఎల్ అండ్ టీ.. హైదరాబాద్ మెట్రో రైల్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
పాతబస్తీకి మెట్రో ఎప్పుడు? మమ్మల్ని మరుస్తారా? అన్న కోపాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా తప్పు పట్టినా.. గులాబీ నేతలు ఎవరూ మాట్లాడకపోవటం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? అంటే.. అదే రాజకీయమని చెప్పాలి. మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మజ్లిస్ ఆయువుపట్టు అయిన పాతబస్తీతోనూ కనెక్టివిటీ ఉండాలి. దీనికి సంబంధించి మొదట్లోనే ప్లాన్ రెఢీ చేశారు. కానీ.. అప్పట్లో మెట్రోను వ్యతిరేకించటమే కాదు.. స్థల సేకరణ విషయంలో అసద్ పెట్టిన లొల్లితో.. పాతబస్తీ మినహా.. మెట్రోను సిద్ధం చేయాలని డిసైడ్ అయ్యారు.
పాతబస్తీలో మెట్రోను ఏర్పాటు చేయాలంటే పలు భవనాల్ని కూల్చాల్సి ఉంటుంది. దీనికి అసద్ వ్యతిరేకం. కానీ.. మెట్రో ప్రజలకు అందుబాటులోకి వచ్చాక.. దాని సౌకర్యం ఎంతన్నది చూస్తున్న తర్వాత.. తాను చేసిన తప్పు ఏమిటో ఆయనకు అర్థమైంది. అలా అని.. తన స్టాండ్ ను వెంటనే మార్చుకుంటే రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే.. ఎవరికి ఎలాంటి నష్టం లేని రీతిలో తన నోటికి పని చెప్పటం ద్వారా.. తన లక్ష్యాన్ని పూర్తి చేశారని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం 73 కి.మీ. హైదరాబాద్ మెట్రోలో ఇప్పటికి 69 కి.మీ. రెఢీ చేసి.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చేశారు. ఇది పాతబస్తీ వాసులకు ఆగ్రహాన్ని తెప్పించటంతో పాటు.. మెట్రో సుఖం తమకెందుకు లేదన్న ప్రశ్న ఇప్పుడు వస్తోంది. తాము ఎన్నుకున్న నేతల కారణంగానే తాము మెట్రో సదుపాయాన్ని కోల్పోయినట్లుగా పాతబస్తీ వాసులు భావించటం షురూ అయ్యింది. ప్రజల గుర్రును గుర్తించిన అసద్.. ప్రభుత్వాన్ని.. ఎల్ అండ్ టీపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసద్ మాటల్ని ఏ మాత్రం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియంది కాదు. ఆ మాటకు వస్తే.. నిజంగానే మెట్రో పాతబస్తీకి రావాలనుకుంటే.. ప్రగతి భవన్ కు వస్తున్నట్లుగా కబురు పంపి.. అలా ఎన్ ఫీల్డ్ మీద వెళ్లి.. తన కోసం ఆఘమేఘాల మీద మెట్రో పనులు షురూ చేయాలంటే.. సారు ఏమైనా కాదంటారా? ఈ విషయం అసద్ కు తెలీనదా?
రాజకీయంలో భాగంగా పాతబస్తీ ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగమే తాజా విమర్శలుగా చెబుతున్నారు. తన మిత్రుడి పరిస్థితిని పెద్ద సారుకు అర్థం కావటంతో ఆయన మౌనంగా ఉన్నారు. సారు సైగ లేకుండా మాట్లాడే ధైర్యం గులాబీ బ్యాచ్ లో ఎవరికి ఉండదన్నది మర్చిపోకూడదు. ఈ కారణంగానే.. చాలామందికి స్నేహితుల మధ్య పోరు మొదలైందా? అనిపించినా.. అదంతా ఉత్త రాజకీయంగా చెప్పక తప్పదు.