తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అంటే ఎలా ఉంటుంది? భారీగా, అట్టహాసానికి మారుపేరుగా నిలుస్తుంది. అది పార్టీ పరమైన ప్రక్రియ కావచ్చు లేదా ప్రభుత్వ పరమైన నిర్ణయం అయినా కావచ్చు. కేసీఆర్ తీరులో ఆ భారీ తనం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఆ భారీ సైజుకు కేసీఆర్ తెరదించనున్నారట. ఇది ఆ పార్టీ పొలిట్ బ్యూరోకు సంబంధించిన విషయంలో. ఉద్యమ కాలంలో టీఆర్ ఎస్ పొలిట్ బ్యూరోలో 40మంది వరకు సభ్యులు ఉండేవారు. రాష్ట్ర కార్యవర్గం సైజు సైతం ఇదే స్థాయిలో ఉండేది. ఉద్యమ కాలంలో ఎంత మంది ఉన్నా ఉద్యమానికి ఉపయోగమేనని, కానీ పార్టీ అధికారంలో ఉన్నందున సైజు చిన్నగా ఉంటేనే మేలని పార్టీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. పొలిట్ బ్యూరోలో కేవలం ఆరుగురు మాత్రమే ఉండే విధంగా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
గులాబీ దళపతి కేసీఆర్ ఇటీవల పార్టీ కమిటీలపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏర్పాటు చేసే కార్యవర్గం, పొలిట్ బ్యూరో రెండేళ్ల కాలం ఉంటుంది. సాధారణ ఎన్నికలు ఈ కొత్త కార్యవర్గం హయాంలోనే జరుగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్త కార్యవర్గం కూర్పులో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యవర్గాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఉద్యమ కాలం నాటి ప్రాధాన్యతలు వేరు, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులంతా నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర కార్యవర్గం, పొలిట్ బ్యూరోల్లో పెద్ద సంఖ్యలో నాయకులకు స్థానం కల్పించి నియోజక వర్గంలో ఎమ్మెల్యేకు - ఇన్ చార్జికి పోటీ నాయకత్వాన్ని తయారు చేయడం కన్నా చిన్న సైజు కార్యవర్గానికే పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందని టిఆర్ ఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు గతంలో జిల్లా కమిటీలు ఉండగా...వాటి స్థానంలో ఇప్పుడు నియోజక వర్గ కమిటీలు వేయనున్నారు. జిల్లా కమిటీలను రద్దు చేసి, ఆ స్థానంలో నియోజక వర్గ కమిటీలు ఏర్పాటు చేసే విధంగా టీఆర్ ఎస్ ప్లీనరీలో తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఉండనున్నట్లు సమాచారం.
టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యవర్గం ఈసారి చిన్నసైజులోనే ఉంటుందనే వార్తల నేపథ్యంలో గులాబీ నేతలను సైతం అధినేత ఆలోచనకు తగినట్లుగా ట్యూన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు ప్రభుత్వ పరంగానైనా, పార్టీలోనైనా నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ అధ్యక్షునిదే నిర్ణయం ఉంటుందని, తమ పార్టీ సైతం దీనికి అతీతమైందేమీ కాదని టీఆర్‌ఎస్ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. తుది నిర్ణయం తీసుకునేది పార్టీ అధినేతనే అయిన పరిస్థితుల్లో రాష్ట్ర కార్యవర్గం, పొలిట్ బ్యూరోలో పెద్ద సంఖ్యలో నాయకుల అవసరం లేదని భావిస్తున్నారేమో అని విశ్లేషిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/